న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నైతో సన్‌రైజర్స్‌ ఢీ.. హ్యాట్రిక్‌ విజయం దక్కేనా?

IPL 2019: Chennai Super Kings Vs Sunrisers Hyderabad match Preview, Probable XI

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టోర్నీ మొదటి నుంచి టాప్ ప్లేసులో ఉన్న చెన్నై జట్టు వరుసగా రెండు అనూహ్య పరాజయాలతో రెండవ స్థానంలోకి పడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్‌ రెండు వరుస విజయాలతో పాయింట్లను మెరుగుపరుచుకుని నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్ నెగ్గి ప్లే ఆఫ్ స్థానం సుస్థిరం చేసుకోవాలని చెన్నై చూస్తుండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. రెండు వరుస ఓటములలో ఉన్నా.. నిలకడకు మారుపేరైన చెన్నై జట్టుపై విజయం సాధించడం సన్‌రైజర్స్‌కు అంత సులువేం కాదు. మరి పటిష్ట చెన్నైపై సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్‌ విజయం దక్కేనా?. ఇరు జట్లను ఓసారి పరిశీలిస్తే.

టాపార్డర్‌ సమస్య:

టాపార్డర్‌ సమస్య:

చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాపార్డర్‌ ఈ సీజన్‌లో రాణించలేదు. వాట్సన్‌ (147 పరుగులు), అంబటి రాయుడు (192 పరుగులు), సురేశ్‌ రైనా (207 పరుగులు) ఇప్పటి వరకు కూడా ఓ మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. డుప్లెసిస్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. టాపార్డర్‌ వైఫల్యంతో బ్యాటింగ్ భారం మొత్తం మిడిలార్డర్‌పై పడుతోంది. జాదవ్, బ్రేవో కూడా త్వరగా పెవిలియన్ చేరితే.. ఒత్తిడంతా కెప్టెన్‌ ధోనీపై పడుతోంది. ఒత్తిడిలో కూడా ధోనీ రాణించి విజయాలు అందించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ 314 పరుగులు చేసాడంటే.. చెన్నై అతనిపై ఏవిధంగా ఆధారపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా టాపార్డర్‌ రాణించాల్సిన అవసరం ఉంది.

పటిష్టంగా బౌలింగ్‌:

పటిష్టంగా బౌలింగ్‌:

చెన్నై బౌలింగ్‌ విభాగం మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. పేసర్ దీపక్ చహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సీజన్ మొదటి నుంచి తన అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక శార్దూల్ ఠాకూర్ కూడా శక్తికి మేర రాణించాడు. అయితే స్పిన్ విభాగంలో మాత్రం చెన్నైకి తిరుగులేదు. తాహిర్, హర్భజన్, జడేజాలతో పటిష్టంగా ఉంది. అవసరం అయితే జాదవ్, రైనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తాహిర్ వైవిధ్య బంతులతో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇతడే చెన్నైకి కీలకం.

ఓపెనర్లే కీలకం:

ఓపెనర్లే కీలకం:

సన్‌రైజర్స్‌కు ఓపెనర్లే కీలకం. ఇప్పటివరకు వార్నర్, బెయిర్‌ స్టోలు రాణిస్తేనే సన్‌రైజర్స్‌ విజయాలను అందుకుంది. ఈ ఇద్దరు అసాధారణ ఫామ్‌తో లీగ్ టాపర్లుగా ఉన్నారు. ఈ జోడీ ఈ సీజన్‌లో నాలుగోసారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి విజయాలను అందించారు. ఈ ఇద్దరు విఫలమైతే మిడిలార్డర్‌లో ఆదుకోవడానికి ఒక్కరు కూడా లేరు. విజయ్ శంకర్, పఠాన్, దీపక్ హుడాలు రాణించలేదు. ఈ మ్యాచ్‌లోనైనా మిడిలార్డర్‌ రాణిస్తే విజయం సులువే.

ఖలీల్ వైవిద్యం:

ఖలీల్ వైవిద్యం:

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. ఖలీల్, భువీలు ఆదిలోనే వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖలీల్ వైవిధ్య బంతులతో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మరోవైపు సందీప్‌ శర్మ కూడా రాణిస్తున్నాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్లు పరుగులు నియంత్రిస్తూ వికెట్లు తీస్తుండడం అదనపు బలం. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో సమిష్టిగా రాణిస్తే చెన్నైకి కష్టాలు తప్పవు.

జట్లు అంచనా:

చెన్నై:

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ ( కెప్టెన్), డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్.

సన్‌రైజర్స్‌:

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), కేన్ విలియంసన్ ( కెప్టెన్), విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్.

Story first published: Tuesday, April 23, 2019, 16:42 [IST]
Other articles published on Apr 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X