న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌కు బ్రేక్: ఫించ్, మ్యాక్స్‌వెల్ బాటలోనే స్టార్క్, కమిన్స్

IPL 2019: After Aaron Finch and Glenn Maxwell, Mitchell Starc & Pat Cummins decide to skip the T20 league

న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ మొత్తంలో ముట్టజెప్పుతున్నా ఆసీస్ ఆటగాళ్లు లీగ్‌కు దూరమవుతూనే ఉన్నారు. ఐపీఎల్ 2019 సీజన్లో ఆసీస్ ఆటగాళ్ల మెరుపులు దూరం కానున్నాయా.. అనే సందేహం వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి. సీజన్లో ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. వేలం ప్రక్రియలో తమ పేరు నమోదు చేసుకోలేదు. వీరి బాటలోనే బౌలర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ కూడా చేరారు.

 పేర్లను నమోదు చేసుకోని స్టార్క్, ప్యాట్ కమిన్స్

పేర్లను నమోదు చేసుకోని స్టార్క్, ప్యాట్ కమిన్స్

డిసెంబర్ 18న జైపూర్ వేదికగా నిర్వహించనున్న ఐపీఎల్ వేలం కోసం వీరిద్దరూ పేరు నమోదు చేసుకోలేదని ముంబై మిర్రర్ కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ ముగిశాక 15 రోజుల్లోనే ప్రపంచ కప్ ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత యాషెస్ సిరీస్ కూడా ఉండటం కూడా ఆసీస్ ఆటగాళ్ల నిర్ణయానికి కారణమైంది.

ప్రపంచ కప్, యాషెస్ సిరీస్‌లకు దూరంగా కాకూడదనే

ప్రపంచ కప్, యాషెస్ సిరీస్‌లకు దూరంగా కాకూడదనే

దీంతో పాటుగా ఆసీస్ ఆటగాళ్లు గాయం కారణంగా ప్రపంచ కప్, యాషెస్ సిరీస్‌లకు దూరంగా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారట. స్టార్క్‌ను రిలీజ్ చేస్తున్నట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రకటించింది. ఐపీఎల్ 2018లో స్టార్క్ రూ.9.4కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే సీజన్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదో అనే అనుమానంతో కోల్‌కతా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరం అవుతున్నట్టు స్టార్క్ తెలిపాడు.

వీరిద్దరూ ఐపీఎల్ ఆడటం అనుమానంగానే

వీరిద్దరూ ఐపీఎల్ ఆడటం అనుమానంగానే

కమిన్స్ విషయానికొస్తే రూ.5.4కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ మొత్తం ఆడినా కమిన్స్ ఐపీఎల్‌లో ఆడేందుకు గైర్హాజరీ అయ్యాడు. దీంతో అతని గురించి ఆశ్చర్యానికి గురైనా గాయం కారణంగా రాలేకపోతున్నట్లు తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్, స్మిత్ గత సీజన్లో ఐపీఎల్‌కు దూరమయ్యారు. వచ్చే సీజన్లోనూ వీరిద్దరూ ఐపీఎల్ ఆడటం అనుమానంగానే ఉంది.

Story first published: Thursday, December 6, 2018, 17:02 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X