న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ 3 నిర్ణయాలు తీసుకోకపోతే!: కోహ్లీసేన ప్లేఆఫ్ ఆశలు గల్లంతే!

IPL 2019: 3 bold decisions that could help RCB stand a chance of reaching the playoffs

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎంత మాత్రం కలిసొచ్చినట్టు లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. జట్టులో ఎంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంతవరకు గెలుపు రుచిని చూడలేదు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. తాజాగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది నాలుగో ఓటమి. ఇప్పటివరకు గడిచిన పదకొండు సీజన్లలో బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో మరో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోతే ప్లేఆఫ్‌ ఆశలు గల్లంతే. ఈ నేపథ్యంలో తమ తదుపరి మ్యాచ్‌లో భారీ మార్పులు ఉంటాయని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

"ఐపీఎల్ కేవలం నెలా.. నెలన్నర సమయంలో ముగిసే టోర్నీ. జట్టు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వరుస ఓటములపై మేమంతా కలిసి చర్చిస్తాం. కొత్త చర్యలైనా తీసుకుంటాం. కొత్త ఆటగాళ్లను జట్టులో తీసుకునే అవకాశాలున్నాయి. జట్టు కూర్పు యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుంది. దీంతో రాబోయే మ్యాచ్‌లో జట్టులో మార్పులు ఉంటాయి" అని కోహ్లీ తెలిపాడు.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు కెప్టెన్ జట్టులో ఈ మూడు మార్పులు చేస్తే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అవేంటో ఒక్కసారి చూద్దాం...

హెట్‌మెయిర్, అలీని తప్పించాలి

హెట్‌మెయిర్, అలీని తప్పించాలి

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ హెట్‌మెయిర్, అలీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. ఆర్సీబీ యాజమాన్యంతో పాటు అభిమానులు సైతం హెట్‌మెయిర్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సీజన్‌లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో వీరి స్థానంలో వేరొకరిని ఆడించడం లేదా లోకల్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి.

నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీలను ఆడించాలి

నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీలను ఆడించాలి

ఆర్సీబీ జట్టులో ఉన్న పేస్ బౌలర్లు నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీ. ఈ ఇద్దరినీ కోహ్లీ ఇప్పటివరకు సరిగా వినియోగించుకోలేదని అభిమానుల వాదన. దీంతో తుది జట్టులో వీరికి చోటు కల్పిస్తే... జట్టు విజయాల్లో కొంతమేరకు ప్రభావం చూపిస్తారని అభిమానులు అంటున్నారు. అంతకముందు కుదిరిన కొన్ని ఒప్పందాల కారణంగా నాథన్ కౌల్టర్ నైల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరోవైపు టిమ్ సౌథీ అందుబాటులో ఉన్నప్పటికీ అతడి సేవలను ఆర్సీబీ వినియోగించుకోలేదు.

దేశవాళీ క్రికెటర్లపై నమ్మకముంచాలి

దేశవాళీ క్రికెటర్లపై నమ్మకముంచాలి

ఐపీఎల్‌లో విజయాలను నమోదు చేస్తోన్న జట్లను చూస్తే అందులో దేశవాళీ క్రికెటర్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లనే తీసుకుంటే ఆయా జట్లలో దేశవాళీ క్రికెట్‌లో రాణించిన యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న తీరు నిజంగా అద్భుతం. అయితే, ఆర్సీబీ మాత్రం లోకల్ క్రికెటర్లతో పోలిస్తే... విదేశీ క్రికెటర్లపైనే అతిగా ఆధారపడటం విశేషం.

ఆర్సీబీ తుది జట్టు ఇలా ఉండాలి

ఆర్సీబీ తుది జట్టు ఇలా ఉండాలి

వాషింగ్టన్ సుదంర్, పార్ధీవ్ పటేల్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్, శివం దూబే, పవన్ నేగి, నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీ, యజువేంద్ర చాహల్, నవదీప్ షైనీ/మహ్మద్ సిరాజ్

Story first published: Wednesday, April 3, 2019, 17:17 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X