న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా చాలా కష్టపడాలి: ముంబై బ్యాటింగ్‌పై జయవర్దనే అసంతృప్తి

By Nageshwara Rao
IPL 2018: Young guys like Hardik need to work harder to be consistent: Jayawardene

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు హర్దిక్‌ పాండ్యా చాలా కష్టపడాలని ఆ జట్టు హెడ్ కోచ్‌ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ సందర్భంగా జయవర్దనే మాట్లాడుతూ 'ఈ పరాజయంపై ఎవరిని నిందించదలుచుకోలేదు. కానీ ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేం కొన్ని మ్యాచ్‌లు ఓడినా.. మంచి క్రికెట్‌ ఆడుతున్నామనే భావన కలిగింది. కానీ స్పల్ఫ స్కోరు చేధనకు దిగిన మా బ్యాట్స్‌మన్‌లో ఏ ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడకపోవడం నిరాశ కలిగించింది' అని అన్నాడు.

'10 ఓవర్ల అనంతరం ఎవరైనా బాధ్యత తీసుకుంటారని భావించా. కానీ అలా ఎవరు చేయలేదు' అని అన్నాడు. ఇక, పాండ్యా బ్యాటింగ్‌పై కూడా జయవర్దనే స్పందించాడు. 'ప్రతి ఏటా ఒకే శైలిలో బ్యాటింగ్‌ చేయకూడదు. ఆటలో మెరుగుదల లేకుంటే రాణించడం కష్టం. ఈ విషయాన్ని పాండ్యా నేర్చుకోవాలి. అతను ఇంకా చాలా కష్టపడాలి' అని సూచించాడు.

'కేవలం నైపుణ్యంతో విజయం అందుకోలేం. పరిస్థితులకు దగ్గట్టు ఆడే సామర్థ్యం ఉండాలి. ప్రతి ఆటగాడు ఈ విషయాలను గ్రహించాలి. ఎందుకంటే ఈటోర్నీకి అంతర్జాతీయ బౌలర్లు వినూత్న పద్దతులతో వస్తారు. వారని సమర్థవంతంగా ఎదుర్కునేలా సిద్ధం కావాలి. అలా లేనప్పుడు స్థిరంగా రాణించలేం' అని జయవర్ధనే అభిప్రాయపడ్డాడు.

ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా 19 బంతులాడి కేవలం 3 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై... సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్ట బౌలింగ్ దెబ్బకు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Wednesday, April 25, 2018, 20:22 [IST]
Other articles published on Apr 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X