ఢిల్లీ జట్టు.. గంభీర్ నాయకత్వంలో డేర్ చూపించగలదా..?

Posted By:
IPL 2018: With Gautam Gambhir back home, and Ricky Ponting as coach, Delhi Daredevils can dream of elusive trophy

హైదరాబాద్: బీసీసీఐ చేతుల మీదుగా ఐపీఎల్ ఆరంభమై పది సీజన్లు దాటి పదకొండో సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో జట్టు కాలపరిమితి ప్రకారం.. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను వేలానికి వదిలిపెట్టేశారు. కొంతమందిని మినహాయించి మిగిలిన వారందరినీ వేలానికి వదిలిపెట్టడంతో గౌతం గంభీర్ కూడా జట్టు మారాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరపున ఆడి మూడు సార్లు టైటిళ్లు తెచ్చి పెట్టిన గంభీర్ ఈ సారి ఢిల్లీ జట్టు తరపున ఆడబోతున్నాడు.

పది సీజన్లలో ఒక్కసారి కూడా టాప్ 3 రాలేదు:

పది సీజన్లలో ఒక్కసారి కూడా టాప్ 3 రాలేదు:

ముగిసిన పది సీజన్లలో ఒక్క సారి కూడా టాప్ 3లో స్థానం సంపాదించుకోలేకపోయిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొత్త ఆశలతో పదకొండో సీజన్‌ను ఆరంభిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండుసార్లు విజేతగా నిలిపిన గౌతమ్‌ గంభీర్‌ రావడం డేర్‌డెవిల్స్‌కు బలాన్ని ఇచ్చే అంశం. గౌతిని ఢిల్లీ రూ.2 కోట్ల 80 లక్షలకే దక్కించుకుంది. అతను బ్యాట్స్‌మెన్‌గానే కాక కెప్టెన్‌గా కూడా ఆ జట్టుకు ఎంతో అవసరం.

బౌలింగ్‌లోనూ ఢిల్లీ పటిష్టంగా:

బౌలింగ్‌లోనూ ఢిల్లీ పటిష్టంగా:

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌తో పాటు భారత యువ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను అట్టిపెట్టుకున్న ఢిల్లీ.. తెలివిగా వ్యవహరించింది. మాక్స్‌వెల్‌, రాయ్‌, మున్రో లాంటి విధ్వంసక ఆటగాళ్లు చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రబాడ, బౌల్ట్‌, షమిలతో ఢిల్లీ పటిష్టంగా కనిపిస్తోంది.

ఢిల్లీ బ్యాటింగ్‌ దమ్మేంటో తెలియజేస్తుంది:

ఢిల్లీ బ్యాటింగ్‌ దమ్మేంటో తెలియజేస్తుంది:

ముఖ్యంగా అందరి కంటే అత్యధిక సొమ్ము అందుకుంటున్న మాక్స్‌వెల్‌ (రూ.9 కోట్లు) నుంచి ఆ స్థాయి ప్రదర్శనే ఆశిస్తోంది జట్టు. ఢిల్లీ రాత మారాలంటే రబాడ (రూ.4.2 కోట్లు), షమీ (రూ.3 కోట్లు), మున్రో (రూ.1.9 కోట్లు), జాసన్‌ రాయ్‌ (రూ.1.5 కోట్లు), బౌల్ట్‌ (రూ.2.20 కోట్లు) తప్పక రాణించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్‌లో రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు విధ్వంసక మాక్స్‌వెల్‌ ఉండడం ఢిల్లీ బ్యాటింగ్‌ పవర్ తెలియజేస్తుంది.

షమీపైనే అందరి ఆశలు:

షమీపైనే అందరి ఆశలు:

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో ఉన్న షమి.. ఐపీఎల్‌లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు, భార్యతో వివాదం, రోడ్డు ప్రమాదంలో గాయాలు.. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి. ఎందుకంటే ఈ ఆరోపణల అనంతరం అతను ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. కారు ప్రమాదంలో తలకు తగిలిన దెబ్బ నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించిన షమి.. సత్తా చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు.

గంభీర్ షమీని, మిశ్రాని బ్యాలెన్స్ చేసుకోవాలి:

గంభీర్ షమీని, మిశ్రాని బ్యాలెన్స్ చేసుకోవాలి:

బౌలింగ్‌లో లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (10 సీజన్లలో 134 వికెట్లు) అనుభవం ఢిల్లీకి కీలకం కానుంది. స్పిన్నర్లను సమర్థంగా ఉపయోగించుకుంటాడని గంభీర్‌కు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మిశ్రాను అతను ఎలా ప్రయోగిస్తాడనేది కీలకం. మిశ్రాతో పాటు పేసర్ షమీ కూడా జట్టుకు ప్రధాన బలమనే చెప్పాలి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 12:42 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి