న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో ప్లేఆఫ్ మ్యాచ్.. రద్దయితే చెన్నైకే నష్టం

IPL 2018: Who qualifies for final if CSK vs SRH Qualifier 1 does not take place?

హైదరాబాద్: అనుకోని కారణాల రీత్యా చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోతే చెన్నైకే నష్టం. ఇప్పటికే లీగ్ దశ ముగించుకుని ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టేందుకు 4 జట్లు సిద్ధమైయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పోటీపడనున్న కీలక జట్లు చెన్నై, హైదరాబాద్‌లలో ఉత్కంఠ పోరు నెలకొననుంది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్‌ను రెండు సార్లు ఓడించిన చెన్నై ఈ సారి ప్రదర్శనపై అందరికీ ప్రగాఢ నమ్మకముంది.

వర్షం కారణంగానైనా మ్యాచ్ ఆగిపోతే..

వర్షం కారణంగానైనా మ్యాచ్ ఆగిపోతే..

అయితే, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా, వర్షం కారణంగానైనా మ్యాచ్ ఆగిపోతే.. చెన్నై ఓడిపోయిన దానితో సమానం. ఇక అప్పుడు రాజస్థాన్, కోల్‌కతాల మధ్య జరిగే ఎలిమినేషన్ మ్యాచ్‌లో క్వాలిఫైయింగ్ అయిన జట్టుతో పోరాడాల్సి ఉంటుంది.

గెలుస్తారో.. వారే ఫైనల్‌లో హైదరాబాద్ జట్టుతో

గెలుస్తారో.. వారే ఫైనల్‌లో హైదరాబాద్ జట్టుతో

మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్‌లు తలపడనున్నాయి. ఇది వర్షం కారణంగా రద్దైతే చెన్నై ఎలిమినేషన్ మ్యాచ్ విన్నర్‌తో తలపడాలి. ఆ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో.. వారే ఫైనల్‌లో హైదరాబాద్ జట్టుతో తలపడతారు. ఒకవేళ అలా కానున్న పక్షంలో మ్యాచ్‌లన్నీ యథావిధిగానే కొనసాగుతాయి.

చెన్నై హైదరాబాద్ జట్టుతో రెండు సార్లు తలపడి

చెన్నై హైదరాబాద్ జట్టుతో రెండు సార్లు తలపడి

ఇప్పటి వరకూ చెన్నై హైదరాబాద్ జట్టుతో రెండు సార్లు తలపడింది. ఏప్రిల్ 22న జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో.. మే 13న జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై జట్టే హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చెన్నైతో తలపడి గెలిచేందుకు హైదరాబాద్ జట్టు భారీ కసరత్తులు చేయాల్సిందే.

ముందుగా పంపడంతో బౌలర్లలో గందరగోళం

ముందుగా పంపడంతో బౌలర్లలో గందరగోళం

ఇదిలా ఉంటే లీగ్ దశను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ముగించింది. పంజాబ్‌తో పోటీపడి 154 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.1ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు ధోనీ తన అనుభవాన్ని వాడి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేశాడు. హర్భజన్ సింగ్, దీపక్ చాహర్‌లను ముందుగా పంపడంతో బౌలర్లలో గందరగోళం నెలకొంటుందని అంచనా వేసే పంపినట్లు ధోనీ తెలిపాడు.

Story first published: Monday, May 21, 2018, 12:57 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X