For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ క్రికెట్‌కు నేటితో 149 ఏళ్లు.. మొదటి మ్యాచ్‌లో గెలిచింది ఎవరో తెలుసా?

క్రికెట్ ప్రపంచంలో ఎన్నో ఫార్మాట్లు వచ్చినా టెస్ట్ క్రికెట్‌ను ఇప్పటికీ అసలైన ఆటగా పరిగణిస్తారు. 5 రోజుల పాటు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సాగే ఈ ఆట ఆటగాడి ప్రతిభకు, సహనానికి అసలైన పరీక్ష. ఈ చారిత్రాత్మక ప్రయాణం మొదలై నేటికి సరిగ్గా 149 ఏళ్లు పూర్తయ్యాయి. 1877 మార్చి 15న ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.

ఎక్కడ? ఏ జట్ల మధ్య జరిగింది? '
తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. 1877 మార్చి 15 నుంచి 19 వరకు జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ డేవ్ గ్రెగొరీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ ఓపెనర్ చార్లెస్ బానర్‌మెన్ చారిత్రక సెంచరీ(165) సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నమోదైన మొదటి సెంచరీ ఇదే. ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా, బానర్‌మెన్ పోరాటంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియాకు 49 పరుగుల ఆధిక్యం లభించింది.

149 Years of Test Cricket First Official Test Australia vs England History and Result Full Details

ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ముందు 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ఆస్ట్రేలియా బౌలర్ టామ్ కెండల్ 7 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ 108 పరుగులకే పరిమితమైంది. దీనివల్ల ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో మొదటి టెస్ట్ మ్యాచ్‌ను కైవలం చేసుకుంది.

చారిత్రక ప్రాధాన్యత
ఈ మ్యాచ్‌తోనే టెస్ట్ క్రికెట్ అనే సుదీర్ఘ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలైన ఈ పోటీనే ప్రపంచ ప్రసిద్ధ 'యాషెస్' సిరీస్‌కు పునాది వేసింది. నేడు టీ20ల హడావిడి ఉన్నా ఈ 149 ఏళ్ల టెస్ట్ చరిత్రకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

తొలి అధికారిక టెస్ట్‌లో ఆడిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు:
ఆస్ట్రేలియా: చార్లెస్ బానర్‌మన్, నాట్ థామ్సన్, టామ్ హొరాన్, డేవ్ గ్రెగొరీ (కెప్టెన్), బ్రాన్స్‌బై కూపర్, బిల్లీ మిడ్‌వింటర్, నెడ్ గ్రెగొరీ, జాక్ బ్లాక్‌హామ్ (వికెట్ కీపర్), టామ్ గారెట్, టామ్ కెండాల్, జాన్ హోడ్జెస్.

ఇంగ్లాండ్: హ్యారీ జుప్, జాన్ సెల్బీ (వికెట్ కీపర్), హ్యారీ చార్ల్‌వుడ్, జార్జ్ ఉల్యెట్, ఆండ్రూ గ్రీన్‌వుడ్, టామ్ ఆర్మిటేజ్, ఆల్ఫ్రెడ్ షా, టామ్ ఎమ్మెట్, అలాన్ హిల్, జేమ్స్ లిల్లీవైట్ (జూనియర్) (కెప్టెన్), జేమ్స్ సౌథర్టన్.

Story first published: Sunday, March 15, 2026, 14:19 [IST]
Other articles published on Mar 15, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+