న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: దినేశ్ కార్తీక్ ఖాతాలో మరో మైలురాయి

By Nageshwara Rao
IPL 2018: We were under pressure in this game, says Dinesh Karthik

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ వేలానికి ముందు రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందించిన గౌతం గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎవరును నియమించాలనే దానిపై ఆ జట్టు యాజమాన్యం తీవ్ర తర్జన భర్జనలు పడింది.

కోల్‌కతా కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక​ చేయాలా? లేక రాబిన్‌ ఉతప్పకు పగ్గాలు అప‍్పచెప్పాలా? అనే అంశంపై లోతుగా విశ్లేషించింది. చివరకు కోల్‌కతా యాజమాన్యం దినేశ్ కార్తీక్‌వైపే మొగ్గుచూపింది. తనపై కేకేఆర్ యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని దినేశ్‌ కార్తీక్‌ వమ్ము చేయలేదు.

జట్టుని ముందుండి నడిపిస్తున్న దినేశ్ కార్తీక్

జట్టుని ముందుండి నడిపిస్తున్న దినేశ్ కార్తీక్

ఈ సీజన్ ఆరంభం నుంచీ దినేశ్ కార్తీక్ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. తన ప్రదర్శనతో కెప్టెన్‌గా జట్టులోని మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దినేశ్ కార్తీక్‌ నిలిచాడు.

490 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్

490 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్

ఈ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటివరకు 490 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఓ ఆటగాడు చేసిన ఆత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గత సీజన్ల పరంగా చూస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాబిన్‌ ఉతప్ప(660-2014 సీజన్) ముందు వరుసలో ఉన్నాడు.

 క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించిన కోల్‌కతా

క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించిన కోల్‌కతా

ఆ తర్వాత గౌతమ్ గంభీర్ (590-2012, 501-2016, 498-2017) అత్యధక పరుగుల్ని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో సౌరవ్‌ గంగూలీ(493-2008 సీజన్) ఉన్నాడు. కాగా బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా 25 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

కోల్‌కతా విజయంలో దినేశ్ కార్తీక్ కీలకపాత్ర

కోల్‌కతా విజయంలో దినేశ్ కార్తీక్ కీలకపాత్ర

ఈ విజయంలో కోల్‌కతా కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ (52;38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు తీయగా, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌లు తలో వికెట్‌ తీశారు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వాలిఫయిర్-2

ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వాలిఫయిర్-2

ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుక్రవారం ఇదే వేదికగా క్వాలిఫయిర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ముంబైలోని వాంఖడె వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చెన్నై ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, May 24, 2018, 14:59 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X