న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు వికెట్లు తీసి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రాజ్‌పుత్

By Nageshwara Rao
IPL 2018: Virender Sehwag Lauds Ankit Rajpoot For Taking First Five-For Of Indian Premier League 11

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ యువ పేసర్ అంకిత్‌ రాజ్‌పుత్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి (5/14) ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే ఐదు వికెట్లు సాధించిన తొలి భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా ఐదు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ఇషాంత్‌ శర్మ (5/11) ఐపీఎల్‌ 2011 సీజన్‌ తొలి సారి ఈ ఘనతను సాధించాడు.

ఈ మ్యాచ్‌లో అంకిత్ రాజ్‌పుత్‌ వేసిన ప్రతి ఓవర్‌లో వికెట్‌ సాధించాడు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అత్యత్తుమ ప్రదర్శన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఆటగాడు మయాంక్ మార్కండే(4/23)ను అంకిత్ రాజ్‌పుత్‌ అధిగమించాడు. ఈ సందర్భంగా అంకిత్ రాజ్‌పుత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

మ్యాచ్‌ అనంతరం రాజ్‌పుత్‌ మాట్లాడుతూ 'ఐపీఎల్‌ అంత సులువైనదిగా నేను భావించడంలేదు. ప్రతి ఆటగాడు చాలా కష్టపడి రాణిస్తున్నారు. నేను వికెట్లు తీసీ నా బౌలింగ్‌తో రాణించా. మంచి ప్రణాళికతో వచ్చి విజయవంతమయ్యా. ఇది నారోజు కావడంతో ఐదు వికెట్లు దక్కాయి' అని తెలిపాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 133 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Friday, April 27, 2018, 17:21 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X