ఉప్పల్ వేదికగా ముంబై, హైదరాబాద్‌ల సమరం నేడే..

Posted By:
 IPL 2018: SRH vs MI preview: Playing 11s, Timings, Live streaming & More

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఇప్పటి మూడు సార్లు లీగ్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై.. హైదరాబాద్ జట్టును ఢీకొననుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలతో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో సమరానికి సై అంటోంది. ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై జట్టు ఆటగాళ్లు తీవ్రమైన ప్రాక్టీసు చేశారు. ఇక బౌలింగ్‌ను తమ ప్రధాన ఆయుధంగా చేసుకుని కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతోంది.

ఈ ఐపీఎల్‌ను ముంబై ఓటమితో మొదలుపెట్టగా.. సన్‌రైజర్స్‌ విజయంతో బోణీకొట్టింది. ఇక ఇరుజట్లు రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో జోరు కొనసాగించాలని సన్‌రైజర్స్‌ ఉవ్విళ్ళూరుతుండగా.. రెండో పోరులోనైనా బోణీ చేయాలని ముంబై పట్టుదలగా ఉంది. ఈనేపథ్యంలో గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే పోరులో సన్‌రైజర్స్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది.

పరుగుల వరద పారిస్తున్న ధావన్:

జట్టులో చేరినప్పటి నుంచి పరుగుల వరద పారిస్తున్న ధావన్.. వార్నర్ దూరమవడంతో ఆ స్థానం కోసం ధావన్‌పైనే ఆశలు పెట్టుకుంది. అయితే కెప్టెన్ గా కాకపోయినా పరుగులలో మాత్రం ఏ లోటు లేకుండా బాదేస్తున్నాడు. ధూం..దాం.. ధావన్ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధావన్‌ (78 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌ ఇటు సన్‌రైజర్స్‌ జట్టులో.. అటు అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.

కేన్‌ విలియమ్సన్‌ స్ఫూర్తిదాయక నాయకత్వం

వార్నర్‌ మాదిరే ధావన్‌ ఇన్నింగ్స్‌ కూడా పూర్తి సాధికారితతో సాగింది. మరోవైపు కేన్‌ విలియమ్సన్‌ స్ఫూర్తిదాయక నాయకత్వం అందరినీ ఆకట్టుకుంది. పెద్దగా హడావుడి లేకుండా విలియమ్సన్‌ మైదానంలో తన పని తాను చేసుకుపోయాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ వనరుల్ని సమర్థంగా వినియోగించుకుని ఫలితాన్ని రాబట్టాడు. లక్ష్య ఛేదనలో ధావన్‌, విలియమ్సన్‌ పని పూర్తి చేయడంతో మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌, వృద్ధిమాన్‌ సాహా, షకిబ్‌ అల్‌ హసన్‌లకు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు.

బౌలింగ్ మాయాజాలంతోనూ:

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కూర్పు మరోసారి అదిరింది. పదునైన పేసర్లు.. నాణ్యమైన స్పిన్నర్లతో ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ సన్‌రైజర్స్‌ సొంతమిప్పుడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల భువనేశ్వర్‌కుమార్‌.. గంటకు 150 కిమీ వేగంతో బంతులు సంధించగల స్టాన్‌లేక్‌.. స్ట్రైక్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌లతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. వైవిధ్యమైన లెగ్‌ స్పిన్‌తో రషీద్‌ఖాన్‌ .. విస్తృతానుభవమున్న ఎడమచేతి వాటం స్పిన్నర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ తిరుగులేని ఆయుధాలుగా పనికొస్తున్నారు.

ఏ జట్టుకైనా కష్టంతో కూడుకున్నదే:

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ ఐదుగురు బౌలర్లు సమర్థంగా బౌలింగ్‌ చేయడంతో పార్ట్‌టైం స్పిన్నర్‌ యూసుఫ్‌, దీపక్‌ హుడాలకు బౌలింగ్‌ చేసే అవకాశమే రాలేదు. భువి, స్టాన్‌లేక్‌, షకిబ్‌, కౌల్‌, రషీద్‌ పరుగులివ్వకుండా ప్రత్యర్థిని కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఆరంభం నుంచే జట్టు విజయానికి బాటలు వేశారు. ప్రస్తుతం దుర్భేధ్యంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టంతో కూడుకున్నదే.

ఆరంభంలో తడబడడం అలవాటే:

ఐపీఎల్‌లో గత సీజన్‌లను గమనిస్తే ముంబై ఇండియన్స్‌ ఆరంభం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. మంచి బ్యాటింగ్‌ ఆర్డర్‌.. నాణ్యమైన బౌలింగ్‌ విభాగం కలిగి తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది ముంబై జట్టు. నిరుడు ఉప్పల్‌ స్టేడియంలో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని అందుకున్న ముంబై. ఐపీఎల్‌-11 జైత్రయాత్రను హైదరాబాద్‌ నుంచే ప్రారంభించాలని భావిస్తోంది.

జట్లు (అంచనా):

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), సాహా (వికెట్‌ కీపర్‌), శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌, స్టాన్‌లేక్‌, సిద్ధార్థ్‌ కౌల్‌
ముంబై ఇండియన్స్‌: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), లూయిస్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, పొలార్డ్‌, బుమ్రా, మెక్లెనగన్‌, ముస్తాఫిజుర్‌ రహమాన్‌, మార్కండే

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 12:19 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి