న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: గత ఓటమికి పంజాబ్‌పై బదులు తీర్చుకుంటారా?

By Nageshwara Rao
IPL 2018: SRH vs KXIP Preview: Playing 11s, Timings, Live Streamig & More

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌తో తలపడుతుంది. ఐపీఎల్ 11వ సీజన్‌ను హ్యాట్రిక్ విజయాలతో ప్రారంభించిన సన్‌రైజర్స్‌కు తొలి బ్రేక్ వేసింది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టే. ఈ సీజన్‌లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గిన సన్‌రైజర్స్‌... పంజాబ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

ఇప్పుడు ఓటమి బదులు తీర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అవకాశం లభించింది. సొంతగడ్డపై గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగింట విజయం సాధించగా... రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 3వ స్ధానంలో కొనసాగుతోంది.

సొంతగడ్డపై చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ, వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ఆ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో 118 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుని, ముంబై ఇండియన్స్‌ను 87 పరుగులకే కుప్పకూల్చిన తీరు నిజంగా అద్భుతం.

 గాయం నుంచి కోలుకున్న ధావన్

గాయం నుంచి కోలుకున్న ధావన్

సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ భువనేశ్వర్‌ లేకున్నప్పటికీ, జట్టులోని యువ ఆటగాళ్లు సందీప్‌శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, బాసిల్‌ థంపి.. స్పిన్నర్లు మహ్మద్‌ నబి, షకిబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌ కలిసికట్టుగా జట్టుకు విజయాన్ని అందించిన తీరు ప్రశంసనీయం. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకొచ్చిన ధావన్‌ పూర్తిగా విఫలమయ్యాడు.

 హైదరాబాద్‌లో మిడిలార్డర్ వైఫల్యం

హైదరాబాద్‌లో మిడిలార్డర్ వైఫల్యం

ఇక, కెప్టెన్‌ విలియమ్సన్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడం.. మిడిలార్డర్‌లో సాహా, మనీష్‌ పాండే, షకిబ్‌ ఉల్ హాసన్ తక్కువ స్కోర్లకే పరిమితం కావడం... హైదరాబాద్ బ్యాటింగ్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇక, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయాల్లో క్రిస్ గేల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

పంజాబ్ విజయాల్లో క్రిస్ గేల్‌దే కీలకపాత్ర

పంజాబ్ విజయాల్లో క్రిస్ గేల్‌దే కీలకపాత్ర

ఈ సీజన్‌లో పంజాబ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన క్రిస్ గేల్ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాలను కట్టబెట్టాడు. జనవరిలో జరిగిన వేలంలో అన్ని ఫ్రాంచైజీలు గేల్‌ను కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో చివర్లో కనీస ధరకు క్రిస్ గేల్‌ను పంజాబ్ సొంతం చేసుకుంది. గేల్‌ రెండు లేదా మూడు మ్యాచ్‌ల్లో మమ్మల్ని గెలిపిస్తే అతనిపై పెట్టిన డబ్బులు వచ్చినట్లేనని పంజాబ్‌ మెంటార్ సెహ్వాగ్ అన్న సంగతి తెలిసిందే.

గేల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ ఘన విజయం

గేల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ ఘన విజయం

సెహ్వాగ్ అన్నట్లే గేల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో 229 సగటుతో 229 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ సీజన్‌లో తొలి సెంచరీ గేల్‌దే కావడం మరో విశేషం. ఈ సెంచరీని సన్ రైజర్స్ హైదరాబాద్‌నే బాదాడు.

యువరాజ్ బ్యాట్ నుంచి రాని భారీ ఇన్నింగ్స్‌లు

యువరాజ్ బ్యాట్ నుంచి రాని భారీ ఇన్నింగ్స్‌లు

గేల్‌ తర్వాత పంబాజ్ జట్టులో రాణిస్తోన్న ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. 6 మ్యాచ్‌ల్లో 236 పరుగులతో పంజాబ్‌ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కరుణ్‌ నాయర్‌ మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించడం లేదు. మిడిలార్డర్‌లో యువరాజ్‌సింగ్‌ ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్‌లో ఆండ్రూ టై, కెప్టెన్‌ అశ్విన్‌, ముజీబ్‌ ఉర్ రెహ్మాన్‌లపై పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతోంది.

జట్ల వివరాలు (అంచనా)

జట్ల వివరాలు (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్‌, సాహా (వికెట్‌ కీపర్‌), మనీష్‌ పాండే, షకిబ్‌, యూసుఫ్‌ పఠాన్‌, రషీద్‌ఖాన్‌, బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మ, మహ్మద్‌ నబి/ బ్రాత్‌వైట్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:

అశ్విన్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ఫించ్‌, యువరాజ్‌, బరిందర్‌, టై, ముజీబ్‌, రాజ్‌పుత్‌

LIVE ON STAR SPORTS FROM 8 PM

Story first published: Thursday, April 26, 2018, 15:39 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X