న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR Eliminator: ఏ జట్టు ఓడినా ఇంటికే!

By Nageshwara Rao
IPL 2018 Preview KKR v RR: In-form Knights face resilient Royals in Eliminator

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

ఎందుకంటే ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై కోల్‌కతానే విజయం సాధించింది కాబట్టి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సమతౌల్యంగా ఉంది. లీగ్ దశలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించన కోల్‌కతా ఎటువంటి సమీకరణలకు తావులేకుండా ఫ్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ప్లేఆఫ్స్‌కు చేరిన మిగతా 3 జట్లకు లేని అదనపు బలం (సొంతగడ్డపై ఆడనుండటం) కోల్‌కతాకు బాగా కలిసి రానుంది. క్వాలిఫయర్‌-2 కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ జట్టుతో ఇదే వేదికగా తలపడాల్సి ఉంటుంది.

కెప్టెన్‌గా జట్టుని ముందుడి నడిపిస్తోన్న దినేశ్ కార్తీక్

కెప్టెన్‌గా జట్టుని ముందుడి నడిపిస్తోన్న దినేశ్ కార్తీక్

ఈ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్‌గా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో 54.78 సగటుతో 438 పరుగులు చేసి కోల్‌కతా జట్టు తరుపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నరైన్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలో ఇరగదీస్తున్నాడు. ఇక, ఓపెనింగ్‌లో నరైన్, క్రిస్ లిన్‌ ఆ జట్టుకు చక్కటి శుభారంభాలను ఇస్తున్నారు. మిడిలార్డర్‌లో ఆండ్రూ రసెల్‌ విజృంభణ జట్టుకు అదనపు బలం.

సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన రసెల్

సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన రసెల్

ఆరంభ మ్యాచ్‌ల్లో రసెల్ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇక, రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా, శుబ్‌మన్‌ గిల్‌లు జట్టును భారీస్కోరు దిశగా తీసుకెళ్లరు. బౌలింగ్‌లో సియర్లెస్, ప్రసిధ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగే సమర్ధులు.

 నిలకడలేమితో సతమతమవుతోన్న రాజస్థాన్ రాయల్స్

నిలకడలేమితో సతమతమవుతోన్న రాజస్థాన్ రాయల్స్

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలకడలేమితో సతమతమవుతోంది. పడుతూ లేస్తూ.. ఆఖరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్లు జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బే.

 కోల్‌కతాపై గెలవాలంటే సమిష్టిగా పోరాడాల్సిందే

కోల్‌కతాపై గెలవాలంటే సమిష్టిగా పోరాడాల్సిందే

భారీ లక్ష్యాలను ఛేదించే సత్తా ఇప్పటి రాయల్స్‌ జట్టుకు లేదనే చెప్పాలి. ప్రస్తుతం నైట్‌రైడర్స్‌ను గెలవాలంటే తప్పకుండా జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుంది. రహానే, షార్ట్, త్రిపాఠి సమష్టిగా రాణిస్తేనే ప్రత్యర్థి జట్టు ముందు ఓ మోస్తారు స్కోరుని రాజస్థాన్ ఉంచగలదు. రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్‌ వైవిధ్యం జట్టుకు కలిసిరానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా స్పిన్నర్లు సునీల్‌ నరైన్‌, పియూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌ ఎంత సమర్థంగా ఎదుర్కొంటారనే దానిపైనే రాజస్థాన్‌ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

జట్ల వివరాలు (అంచనా)

జట్ల వివరాలు (అంచనా)

కోల్‌కతా: దినేష్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), నరైన్‌, రస్సెల్‌, క్రిస్‌ లిన్‌, ఊతప్ప, కుల్దీప్‌, పియూష్‌ చావ్లా, నితీష్‌ రాణా, ప్రసిధ్‌ కృష్ణ, శుభ్‌మన్‌ గిల్‌, సెరెల్స్‌.

రాజస్థాన్‌: రహానె (కెప్టెన్‌), బిన్నీ, సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి, క్లాసెన్‌, కృష్ణప్ప గౌత మ్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, ఇష్‌ సోధి, ఉనాద్కట్‌, బెన్‌ లాలిన్‌.

Story first published: Wednesday, May 23, 2018, 15:13 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X