పాంటింగ్ తొలి స్పీచ్ అదిరిపోయింది, ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు

Posted By:
IPL 2018: Pontings speech gave goosebumps to Shreyas Iyer

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌కు ఎనిమిది ఫ్రాంచైజీలు భారీ ఎత్తున సిద్ధమైయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమ జట్టులో కొత్త ఉత్సాహం నింపేందుకు రికీ పాంటింగ్ కాసేపు ప్రసంగించాడట. అది వింటుంటే రోమాలు నొక్కబొడుచుకున్నాయంటున్నాడు శ్రేయాస్ అయ్యర్.

రోమాలు నిక్కబొడుచుకునేలా:

రోమాలు నిక్కబొడుచుకునేలా:

రెండు సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్‌ అందించిన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌కు రికీ పాంటింగ్‌ ఢిల్లీ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పాంటింగ్‌ జట్టుతో చేరిన అనంతరం జరిగిన తొలి సమావేశంలో ఆటగాళ్ల రోమాలు నిక్కబొడుచుకునేలా ప్రసంగించాడని అయ్యర్‌ తెలిపారు.

 ప్రధానాంశంగా ఇదే చెప్పి:

ప్రధానాంశంగా ఇదే చెప్పి:

ఆటలో గెలవడం ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత ప్రదర్శన కాకుండా జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆడాలని ప్రతీ ఆటగాడికి పాంటింగ్‌ సూచించాడన్నారు. జట్టులోని ఆటగాళ్ల లోపాలను నిర్మోహటంగా వివరిస్తున్నాడన్నారు.

2015లాగే 2018లోనూ:

2015లాగే 2018లోనూ:

పాంటింగ్‌ మెంటార్‌గా ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2015 విజేతగా నిలిచిందని, ఇప్పుడు ఢిల్లీ ఐపీఎల్‌ 2018 విజేతగా నిలిచి తీరుతుందనే నమ్మకాన్ని అయ్యర్‌ వ్యక్తం చేశాడు. ఇక డేర్‌డెవిల్స్‌ మాజీ కోచ్‌ ద్రవిడ్‌పై కూడా ఈ ఆటగాడు తన అభిమానాన్ని చాటాడు.

వాళ్లిద్దరూ ఒకే తీరు:

వాళ్లిద్దరూ ఒకే తీరు:

ద్రవిడ్‌, పాంటింగ్‌లిద్దరూ ఒకే మైండ్‌ సెట్‌ గలవారని, ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోరని వెల్లడించారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు రెండు సార్లు కప్‌ అందించిన గొప్ప సారథి గౌతం గంభీర్‌ అని ప్రస్తుతం అతని నాయకత్వంలోని ఢిల్లీ ఈ సారి ఐపీఎల్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతుందన్నారు. సీనియర్లు, జూనియర్లతో జట్టు పటిష్టంగా ఉందని, ఆటగాళ్లందరూ గెలవాలనే పట్టుదలతో ఉన్నారని, ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 3, 2018, 12:59 [IST]
Other articles published on Apr 3, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి