ఆ మార్పే చెన్నై ఓటమికి కారణం: ధోని వివరణ (వీడియో)

Posted By:
IPL 2018: MS Dhoni wants to try Ravindra Jadeja in finishers role

హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమికి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పే కారణమా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోని తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ, విజయానికి చేరువుగా వచ్చి చెన్నై ఓటమి పాలైంది.

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్ష్య ఛేదనలో చెన్నై జట్టు 13.4 ఓవర్లు ముగిసే సమయానికి 113/3తో నిలిచిన దశలో అప్పటి వరకూ దూకుడుగా ఆడుతున్న అంబటి రాయుడు (49: 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు) రనౌటవగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.

బ్రేవోని కాదని రవీంద్ర జడేజాను ముందుగా బ్యాటింగ్‌

బ్రేవోని కాదని రవీంద్ర జడేజాను ముందుగా బ్యాటింగ్‌

తొలి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఓటమి అంచు నుంచి విజయాన్నందించిన విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోని కాదని రవీంద్ర జడేజాను ముందు బ్యాటింగ్‌ పంపిచడంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ఒక ఎండ్‌లో ధోని (79 నాటౌట్: 44 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు) వెన్నునొప్పితో దూకుడుగా ఆడలేక పోతున్నాడు.

సింగిల్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన జడేజా

సింగిల్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన జడేజా

అదే సమయంలో దూకుడుగా ఆడాల్సిన రవీంద్ర జడేజా (19) ఎక్కువగా సింగిల్స్‌ తీశాడు. దీంతో చివర్లో ధోనిపై ఒత్తిడి పెరిగింది. జట్టు స్కోరు 163(18.2 ఓవర్లలో) వద్ద జడేజా ఔటవగా.. అనంతరం వచ్చిన బ్రావోకి (1) కేవలం ఒక బంతి మాత్రమే ఆడాడు. అదే జడేజా స్థానంలో బ్రావో వచ్చి ఉంటే.. ధోనీతో కలిసి అతడు మరిన్ని పరుగులు రాబట్టగలిగేవాడు.

డగౌట్‌లో ఉన్న ఫ్లెమింగ్‌కు చాలా కష్టం

డగౌట్‌లో ఉన్న ఫ్లెమింగ్‌కు చాలా కష్టం

తద్వారా పరుగుల, బంతుల మధ్య అంతరం తగ్గేదని క్రికెట్ విమర్శకులు అంటున్నారు. ఈ విమర్శలపై చెన్నై కెప్టెన్ ధోని స్పందించాడు. ‘బ్యాటింగ్‌కు ఎవరిని పంపిచాలని నిర్ణయం తీసుకోవడం ఆ పరిస్థితుల్లో డగౌట్‌లో ఉన్న ఫ్లెమింగ్‌కు చాలా కష్టం. మేమంతా జడేజాపై నమ్మకం ఉంచాం. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడం కూడా ఆ సమయంలో అతడ్ని పంపడానికి ఒక కారణం కావొచ్చు' అని ధోని చెప్పాడు.

జడేజాను ముందుగా దింపడంపై ధోని

'ఎడమ చేతివాటం ఆటగాళ్లకు బౌలర్లు స్థిరంగా బంతులు వేయలేరు. దీంతో అతనికి అవకాశం ఇచ్చాం. ఒకవేళ అతను విఫలమైతే మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే సామర్థ్యం గల హిట్టర్‌ బ్రేవో ఎలాగు ఉన్నాడని భావించాం. బ్రేవో మా వెనుకాలే ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. కానీ ఓవరాల్‌గా జడేజా లేదా ఎవరైనా ఫినిషర్‌గా రాణిస్తే అది మాకు మంచిదే. ఇక ఇలాంటి అవకాశం జడేజాకు ఎప్పుడివ్వలేదు. అతను ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి సరైన అర్హుడు. రాబోయే మ్యాచ్‌ల్లో ముగించే మరిన్ని అవకాశాల్ని జడేజాకి ఇస్తాం' అని ధోని స్పష్టం చేశాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 16:10 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి