న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిద్ర లేకుండా చేశావ్ ధోనీ.. చెన్నై విజయంపై స్పందించిన క్రికెటర్లు

IPL 2018: MS Dhoni the real Universe Boss, says Matthew Hayden

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోహ్లీ జట్టుపై ధోనీ చెలరేగి ఆడాడు. కేవలం 34 బంతుల్లో 70 పరుగులను చేసిన ధోనీ చెన్నై జట్టకు విజయం అందించడంలో కెప్టెన్‌గా చక్కటి బాధ్యతను నిర్వర్తించాడు. బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని, అంబటి రాయుడు సిక్సర్లతో చెలరేగిపోయారు. ధాటిగా ఆడి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 5 వికెట్ల తేడాతో చైన్నై జట్టు అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్‌కే జట్టుపై అభిమానులు, క్రికెట్‌ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక చాలాకాలం తర్వాత సిక్సర్ల మోత మోగించి జట్టుకు అనూహ్య విజయాన్నందించిన 'మిస్టర్‌ కూల్‌' ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ధోని వీరోచిత హిట్టింగ్‌పై ట్వీటర్‌లో కామెంట్లు చేశాడు.

సిక్సర్ల వర్షంతో నిద్రకు భంగం కల్గించారు:

‘ఓరి దేవుడా కాసేపు పడుకుందామనుకుంటే సిక్సర్ల వర్షంతో నా నిద్రకు భంగం కల్గించారు. చైన్నైకి అద్భుత విజయాన్ని అందించారు. కానీ నా నిద్ర మాత్రం డిస్టర్బ్‌ అయ్యింది. ఎంతైనా ఎంఎస్‌ దోని విశ్వ విఖ్యాత ఆటగాడు. మీ ఆటకు విజిల్‌ వేయాల్సిందే...(విజిల్‌ పోడు)' అంటూ హెడెన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక అంబటి రాయుడి విజృంభణ ఈ ఐపీఎల్‌ సీజన్‌ చివరి వరకు కొనసాగుతుందంటూ హెడెన్‌ ఆకాంక్షించారు.

'తలా' అని ఎందుకు పిలుస్తారో :

ఇక భారత మాజీ క్రికెటర్ అయిన హేమంగ్ బాదనీ తన ట్విట్టర్ అకౌంట్‌లో 'మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేసేందుకు వయస్సు అడ్డుకాదని మరోసారి నిరూపించాడు. మళ్లీ అతన్ని ఇంతటి ఫామ్‌లో చూడటం ఆనందంగా ఉంది. వాళ్లు ధోనీని 'తలా' అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది. నిజమైన బాస్ ఎవరో అర్థమైంది' అని పేర్కొన్నాడు.

ముగింపు మాత్రం ధోనీయే

టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. క్రికెట్ గురించి రాసే పుస్తకం ఏదైనా సరే దాని ముగింపు మాత్రం ధోనీయే అవుతాడు. . ఇక ధోనీ ఇన్నింగ్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఫిదా అయిపోయాడు. 'కమాల్ హీ కర్తా రహ్తే హై ఎంఎస్ ధోనీ. బ్రిలియంట్ అగైన్' అని ట్వీట్ చేశాడు. 'ఏం ఆడావ్ గురూ ఎంఎస్ ధోనీ. భళే ముగించావ్ మ్యాచ్‌ని' అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు.

సూపర్ కింగ్స్ అంతకంటే బాగా

ధోనీ ఇన్నింగ్స్‌కు బాలీవుడ్ హీరో రణవీర్‌ సింగ్ సైతం స్పందించాడు. 'ఈ విషయం చెప్పాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బాగా ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్ అంతకంటే బాగా ఆడింది. రాయుడు ఆట తీరు అద్భుతం. ధోనీ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. అతనొక ఛాంపియన్' అంటూ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్ కూల్ అద్భుతమైన ఇన్నింగ్స్

సురేశ్ రైనా ..' ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నంత వరకు జట్టుకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. అంబటి రాయుడుతో కలిసి కెప్టెన్ కూల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. విజయాన్నే ఇలానే కొనసాగించాలి' అని తెలిపాడు. వీరితో పాటు సంజయ్ మంజ్రేకర్, రణ్‌వీర్ సింగ్, దీప్ దాస్‌గుప్తా, హర్బజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్‌లతో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్ సైతం శుభాకాంక్షలు తెలిపింది.

Story first published: Thursday, April 26, 2018, 15:14 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X