వెన్నునొప్పి: రాజస్థాన్ మ్యాచ్‌కి ధోని దూరమేనా?

Posted By:
IPL 2018: MS Dhoni is likely to miss match against Rajasthan Royals

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంత మాత్రం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. సీజన్ ఆరంభం నుంచీ ఆ జట్టు ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కావేరీ జల వివాదం ఆందోళన కారణంగా సొంత మైదానమైన చెపాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు దూరమైన సంగతి తెలిసిందే.

చెన్నై అభిమానులను కలవరపెడుతోన్న ధోని వెన్నునొప్పి

చెన్నై అభిమానులను కలవరపెడుతోన్న ధోని వెన్నునొప్పి

ఆ తర్వాత జట్టులోని కీలక ఆటగాళ్లు సురేశ్‌ రైనా, కేదార్‌ జాదవ్‌లు గాయాలతో టోర్నీకి దూరంకావడం, తండ్రి మరణంతో దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి స్వదేశానికి వెళ్లినపోవడంతో చెన్నై జట్టుని కోలుకోకుండా చేశాయి. తాజాగా, చెన్నై కెప్టెన్ ధోని తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటం అభిమానులను కలవరపెడుతోంది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడిన ధోని

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడిన ధోని

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో ఇబ్బందిపడిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూణె వేదికగా ఏప్రిల్ 20న రాజస్థాన్ రాయల్స్ చెన్నై జట్టుతో తలపడనుంది. మూడు రోజుల విరామం దొరకడంతో ధోని కోలుకునే అవకాశాలూ లేకపోలేదు.

 ధోనికి విశ్రాంతి కల్పించే అవకాశం

ధోనికి విశ్రాంతి కల్పించే అవకాశం

అలా కాకుండా రిస్క్ వద్దని భావిస్తే మాత్రం రాజస్థాన్ మ్యాచ్ నుంచి ధోనికి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని వెన్ను నొప్పితో తీవ్ర ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే. చెన్నై ఇన్నింగ్స్‌ మధ్యలో ధోని ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాడు.

వెన్నునొప్పి నన్ను బాధించింది

వెన్నునొప్పి నన్ను బాధించింది

మ్యాచ్ అనంతరం తన వెన్నునొప్పిపై ధోని మాట్లాడుతూ 'అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా' అని అన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 11:23 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి