న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, CSK vs KXIP: ఐదు వికెట్ల తేడాతో చెన్నై విజయం, ప్లేఆఫ్‌లోంచి తప్పుకున్న పంజాబ్

ipl 2018 match 56 CSK vs KXIP live match report from Pune.

జట్టు మళ్లీ రాణిస్తోంది...పునర్వైభవాన్ని తీసుకొస్తుంది అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశనే మిగిల్చింది పంజాబ్. తొలి 6 మ్యాచుల్లో 5 గెలిచి చాన్నాళ్ల వరకు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన ఆ జట్టు వరుస ఓటముల పాలై చివరికి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

హైదరాబాద్:లీగ్ చివరి మ్యాచ్ వరకూ ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నా.. నిలబెట్టుకోలేకపోయింది. ఆఖరి మ్యాచ్‌లో చెన్నైని 53 పరుగులకు పైగా తేడాతో ఓడించాల్సి ఉన్నా అది కుదరలేదు.

ధోనీ (16 నాటౌట్‌) తెలివిగా ఆ జట్టును దెబ్బ కొట్టాడు. 153 పరుగుల లక్ష్య ఛేదనలో అంబటి రాయుడు (10), డుప్లెసిస్‌ (14), శామ్‌ బిల్లింగ్స్‌ (0) వెంటవెంటనే ఔటైన తరుణంలో హర్భజన్‌ (19), దీపక్‌ చాహర్‌ (29)ను పంపించాడు. వారితో నిలకడగా ఆడించి పంజాబ్‌ ఆశలను అడియాసలు చేశాడు. ఇక చివర్లో సురేశ్‌ రైనా (61) చెలరేగడంతో చెన్నై 19.1 ఓవర్లకు విజయం సాధించింది.


మొదటి పది ఓవర్ పూర్తయ్యేసరికి: 58/3

లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ కావడంతో పంజాబ్ జట్టు పటిష్టమైన ఫీల్డింగ్‌తో చెన్నైను కట్టుదిట్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై రెండో ఓవర్‌లోనే సూపర్ ఫామ్ లో ఉన్న అంబటి రాయుడిని పోగొట్టుకుంది. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా క్రీజులో నిలదొక్కుకోగా మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఫాఫ్ డుప్లెసిస్(15), శామ్ బిల్లింగ్స్ (0) పరుగులకు అవుట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హర్బజన్ (21), సురేశ్ రైనా క్రీజులో ఉన్నారు.


పంజాబ్ ఇన్నింగ్స్: 154

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ ఆరంభం నుంచి తడబాటుకు గురైంది. ఈ క్రమంలో 16 పరుగులకే క్రిస్‌ గేల్‌(0), అరోన్‌ ఫించ్‌(4), కేఎల్‌ రాహుల్‌(7) వికెట్లను పోగొట్టుకుంది. మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాసేపు వికెట్లు పడకుండా ఆపగలిగింది మనోజ్ ద్వయం. కాసేపటికి మనోజ్‌ తివారీ(35) పెవిలియన్‌ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్‌ మిల్లర్‌(24) సైతం ఔట్‌ కావడంతో కింగ్స్‌ పంజాబ్‌ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.

అటు తర్వాత స్వల్ప విరామాల్లో కింగ్స్‌ పంజాబ్‌ వికెట్లను చేజార్చుకుంది. కాగా, కరుణ్‌ నాయర్‌(54) ఆదుకున్నాడు. దాంతో కింగ్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది.

చెన్నై పేసర్‌ లుంగి ఎంగిడి.. కింగ్స్‌ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 71/3

టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై బౌలర్లు పంజాబ్‌ను ముచ్చెమటలు పట్టించారు. ఈ క్రమంలో రెండో ఓవర్ మొదలయ్యేసరికి గేల్ వికెట్‌ను ఎంగిడి చేజిక్కుంచుకున్నాడు. అతని తర్వాత క్రీజులోకి వచ్చిన ఫించ్ వికెట్‌ను 2.5 ఓవర్ల వద్ద దీపక్ చాహర్ తీసుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆచితూచి ఆడుతున్న రాహుల్ కూడా 4వ ఓవర్ పూర్తయ్యే సమయానికి అవుట్ అయి వెనుదిరిగాడు. దీంతో మొదటి ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి 23/3 స్కోరుతో పంజాబ్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తి అయినా పంజాబ్ అదే పంథా కొనసాగిస్తోంది. మనోజ్ తివారీ (35), మిల్లర్ (23) క్రీజులో ఉన్నారు.


టాస్ రిపోర్టు:

ఐపీఎల్ లీగ్ దశకు చివరి మ్యాచ్‌లు అయిన ఢిల్లీ వర్సెస్ ముంబై, చెన్నై వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆదివారం ఐపీఎల్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. ఇందులో భాగంగా చెన్నై, పంజాబ్‌ల మధ్య పోరాటం పూణె వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే చెన్నైకి ప్లేఆఫ్ రేసుకు అర్హత పక్కా అయిపోయింది. కానీ ప్రత్యర్థిగా దిగుతోన్న పంజాబ్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం. ఓ వైపు ఢిల్లీ, ముంబైల మధ్య పోరాటం జరుగుతుంది. ఇందులో ఢిల్లీ ఓడితే ముంబై టాప్ 4లో చేరిపోతుంది. అప్పుడు పంజాబ్‌కు ప్లేఆఫ్‌లో స్థానం దక్కడం కష్టమే.

1
43466

ఒకవేళ ఢిల్లీ గెలిస్తే పంజాబ్ పోరులో నిలుస్తుంది. ఇప్పటి వరకూ పంజాబ్ ఆడిన 13 మ్యాచ్‌లలో ఏడింటిలో ఓడిపోయి కేవలం 6మ్యాచ్‌లలో గెలిచింది. మరో పక్క బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 13 మ్యాచ్‌లలో 8 గెలిచి 5 ఓడిపోయింది. అయితే రెండు జట్లకు ఉన్న సామీప్యత ఏమంటే ఆఖరి మ్యాచ్‌ను ఓటమితోనే ముగించాయి.

ఆడనున్న ఇరు జట్లు అంచనా:

ఢిల్లీ డేర్‌డెవిల్స్:
Shane Watson, Ambati Rayudu, Suresh Raina, MS Dhoni (WK/C), Sam Billings, Dwayne Bravo, Ravindra Jadeja, Deepak Chahar, Harbhajan Singh, Shardul Thakur, Lungi Ngidi, Faf du Plessis, Murali Vijay, Imran Tahir, Karn Sharma, N Jagadeesan, David Willey, KM Asif, Kanishk Seth, Dhruv Shorey, Kshitiz Sharma, Monu Kumar, Chaitanya Bishnoi

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
Lokesh Rahul (WK), Chris Gayle, Aaron Finch, Yuvraj Singh, Manoj Tiwary, Marcus Stoinis, Axar Patel, Ravichandran Ashwin (C), Andrew Tye, Mohit Sharma, Ankit Rajpoot, Karun Nair, David Miller, Mayank Agarwal, Mujeeb Ur Rahman, Barinder Sran, Akshdeep Nath, Ben Dwarshuis, Pardeep Sahu, Mayank Dagar, Manzoor Dar

Story first published: Monday, May 21, 2018, 0:19 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X