న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, CSKvsDD: చతికిలబడ్డ చెన్నై, 34పరుగుల తేడాతో ఢిల్లీ విజయం

ipl 2018, match 52: csk vs dd live match report from feroz shah kotla stadium

హైదరాబాద్: చెన్నై ఆటగాళ్లు తలచుకుంటే 163 పరుగులు పెద్ద లక్ష్యమే కాదు. కానీ, అనుకున్న ఫలితాన్ని రాణించలేకపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై ముందుగా అనుకున్నట్లు ఢిల్లీ జట్టుపై సునాయాసంగా పరుగులు రాబట్టగలమని అనుకుని తడబడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బౌలర్ల ధాటికి చెన్నై 5 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో రాణిస్తూ వస్తున్న షేన్ వాట్సన్, ఎంఎస్ ధోనీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అంబటి రాయుడు మాత్రం హాఫ్ సెంచరీ పూర్తవగానే అవుట్ అయ్యాడు. సురేశ్ రైనా, డేన్ బ్రావోలపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యే సరికి: 70/2

ఢిల్లీ బౌలర్లు చెన్నై ఓపెనర్లను అవుట్ చేయడానికి పది ఓవర్లు సమయం పట్టింది. ఈ లోపు అంబటి రాయుడు 29బంతులాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు 6.5ఓవర్లో షేన్ వాట్సన్ అమిత్ మిశ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనబోయి క్యాచ్ ఇవ్వడంతో ట్రెంట్ బౌల్డ్ అందుకుని అవుట్ చేశాడు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి 70/2 స్కోరుతో క్రీజులో అంబటి రాయుడు ఎంఎస్ ధోనీ(0), సురేశ్ రైనా(5) ఉన్నారు.


ఢిల్లీ ఇన్నింగ్స్:

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పడిలేచింది. ఫిరోజ్ షా కోట్ల వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చెన్నై బౌలర్ల ధాటికి 14.4 ఓవర్లలో 97/5తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన ఆ జట్టు.. ఆఖర్లో హర్షల్ పటేల్ (36), విజయ్ శంకర్ (36) చెలరేగడంతో 162 పరుగులు చేయగలిగింది.


15 ఓవర్లు పూర్తయ్యేసరికి 102/5:

పృథ్వీ షా వికెట్ అనంతరం రెండో వికెట్‌గా శ్రేయాస్ అయ్యర్ 10.3ఓవర్లకు అవుటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో వచ్చిన లెంగ్త్ బాల్ కట్ చేసే ప్రయత్నంలో అయ్యర్ బంతిని ఎదుర్కొనలేకపోయాడు. బంతి నేరుగా వికెట్లను తగలడంతో 19పరుగులతో వెనుదిరిగాడు. ఆ తర్వాత 3బంతుల విరామంతోనే రిషబ్ పంత్ 38పరుగులతో మళ్లీ ఓ వికెట్‌ను చేజార్చుకుంది ఢిల్లీ. గ్లెన్ మాక్స్వెల్‌ను రవీంద్ర జడేజా మాయచేశాడు. దీంతో కేవలం 5పరుగులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. అతనికి జోడిగా కొనసాగిన అభిషేక్ శర్మ నాలుగు బంతుల వ్యవధిలోనే భజ్జీ బౌలింగ్‌కు అవుట్ అయ్యాడు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి 77/1:

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు ఢిల్లీ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఓపెనర్లుగా దిగిన పృథ్వీ షా 17బంతుల్లో 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆరంభం నుంచి బౌండరీలకు ప్రయత్నించిన పృథ్వీ ఢిల్లీ బౌలర్లపై రాణించలేకపోయాడు. ఒక ఫోరు, ఒక సిక్సర్ మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మరో ఎండ్‌లో ఓపెనర్‌గా దిగిన శ్రేయాస్ అయ్యర్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందించేలా సహకరిస్తున్నాడు.

ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 52వ మ్యాచ్‌లో ఢిల్లీ, చెన్నై తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికైంది. ఈ నేపథ్యంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

చెన్నైతో మ్యాచ్ అంటేనే వణికిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది ధోనీ సేన. బాదుడే లక్ష్యంతో దూసుకెళ్తున్న జట్టుగా చెన్నై ఐపీఎల్ 11లో దూసుకెళ్తోంది. చెన్నై మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతున్న అంబటి రాయుడు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై మరోసారి తన దూకుడును చూపించేందుకు ఫిరోజ్ షా కోట్లా స్టేడియంను వేదిక చేసుకుంది.

ఈ క్రమంలో సొంతగడ్డపై విజయాన్ని చేజిక్కుంచుకోవాలనే ఆశతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆశపడుతోంది. అంతకుముందు ఢిల్లీతో జరిగిన పోరులో చెన్నై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాత్రం.. చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది.

శుక్రవారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడేయాలని ఢిల్లీ ఆశిస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది.


ఇరు జట్లు అంచనా:

ఢిల్లీ డేర్‌డెవిల్స్:
Prithvi Shaw, Shreyas Iyer (c), Rishabh Pant (wk), Glenn Maxwell, Vijay Shankar, Abhishek Sharma, Harshal Patel, Amit Mishra, Sandeep Lamichhane, Trent Boult, Avesh Khan

చెన్నై సూపర్ కింగ్స్:
Shane Watson, Ambati Rayudu, Suresh Raina, MS Dhoni (c) (wk), Sam Billings, Dwayne Bravo, Ravindra Jadeja, Harbhajan Singh, Deepak Chahar, Shardul Thakur, Lungi Ngidi

Story first published: Friday, May 18, 2018, 23:44 [IST]
Other articles published on May 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X