న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: KXIPvsRR: ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం నమోదు చేసిన పంజాబ్

IPL 2018: KXIPvsRR Match Review
rajasthan-match-report-from-indore-stadium

హైదరాబాద్: ఇండోర్ స్టేడియం వేదికగా పంజాబ్, రాజస్థాన్ జట్లు పోటీపపడ్డాయి.పంజాబ్ తరపున చేధనకు రాహుల్ జట్టును గెలిపించాల్సిందే అనే పట్టుదలను బలంగా నాటుకున్నట్లు కనిపించాడు. కేవలం 54 బంతుల్లో 7×4, 3×6లతో (84 నాటౌట్)గా నిలిచాడు. రాజస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు చక్కని విజయం అందించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యధిక స్కోరు సాధించాడు.

తనదైన కవర్‌డ్రైవ్‌లు, చక్కని సిక్సర్లతో రాహుల్‌ విరుచుకుపడటంతో 153 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది పంజాబ్‌. వికెట్లు పడిన తరుణంలో మార్కస్‌ స్టొయినిస్‌ (23)తో కలిసి చక్కని భాగస్వామ్యం నిర్మించాడు కేఎల్. తొలుత క్రిస్‌గేల్‌ (8) త్వరగా నిష్ర్కమించడంతో కరుణ్‌ నాయర్‌ (31)తో కలిసి కీలక భాగస్వామ్యం అందించాడు.

అంతకు ముందు రాజస్థాన్‌లో బట్లర్‌ (51), సంజూ శాంసన్‌ (28), శ్రేయస్‌ గోపాల్‌ (24) రాణించారు. టోర్నీలో వరుసగా రెండు ఓటముల తర్వాత.. మళ్లీ పంజాబ్ జట్టు గెలుపొందగా.. రాజస్థాన్‌‌కి ఇది వరుసగా మూడో ఓటమి.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోరు: 68/2

రెండు వికెట్ల నష్టానికి 68పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌గా దిగిన క్రిస్ గేల్ కేవలం 11బంతులు ఆడి 8పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిలాక్సేషన్ కోసం కేరళ వెళ్లిచ్చిన గేల్ ఇరగదీస్తాడనుకుంటే ఆరంభంలోనే వెనుదిరిగాడు. 3.2 ఓవర్లో గేల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడు బంతులు మాత్రమే ఆడి 2స్కోరుతో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో ఉన్న కరుణ్ నాయర్(21), రాహుల్ (35)జట్టును నడిపిస్తున్నారు.

బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చక్కగా రాణిస్తున్న రాజస్థాన్‌ను ఎదుర్కోవడం పంజాబ్‌కు కాస్త కష్టంగానే మారింది.


పంజాబ్ జట్టు భారీ లక్ష్యం:153

కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్‌ ఆటగాళ్లలో జాస్‌ బట్లర్‌(51) హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆ తర్వాత సంజూ శాంసన్‌(28), శ్రేయస్‌ గోపాల్‌(24‌)లు ఫర్వాలేదనిపించారు.

బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే డీ ఆర్సీ షార్ట్‌(2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్‌ బట్లర్‌కు కెప్టెన్‌ రహానే జత కలిశాడు. కాగా, రహానే(5) కూడా వైఫల్యం చెందడంతో రాజస్తాన్‌ 35 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్‌-శాంసన్‌ల జోడి మరమ్మతులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్‌ ఔటయ్యాడు. అటు తర్వాత రాజస్తాన్‌ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, అక్షర్‌ పటేల్‌లకు తలో వికెట్‌ లభించింది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యే సరికి: 81/2
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (27), బట్లర్‌ (41)దూకుడుగా ఆడుతున్నారు.

4 ఓవర్లలోనే 2 వికెట్లనూ కోల్పోయిన రాజస్థాన్:
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తడబడుతోంది. వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్‌ మూడో బంతికి ఓపెనర్‌ షార్ట్‌ (2)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 3.4వ బంతికి కెప్టెన్ రహానె (5) పెవిలియన్‌ చేరాడు. అతడి క్యాచ్‌ను క్రిస్‌గేల్‌ డైవ్‌ చేసి అందుకోవడం విశేషం. 5 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 42/2తో ఉంది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (27)జోరుమీదున్నాడు. సంజూ శాంసన్‌ (3) క్రీజులోకి ఉన్నాడు.

1
43448

ఈ క్రమంలో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

లీగ్ పట్టికలో టాప్ స్థానంలో కొనసాగుతోన్న పంజాబ్ జట్టుకు రాజస్థాన్ జట్టుకు రసవత్తరమైన పోరుకు ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. 3 విజయాలు 5 ఓటములతో నెట్టుకొస్తున్న రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని బలమైన పట్టుదలతో ఎదురుచూస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ విభాగంలోనూ అదే ఉత్సాహాన్ని చూపిస్తోన్న కొత్త కెప్టెన్ అశ్శిన్ కెప్టెన్సీలో చక్కగా రాణిస్తోంది. అయితే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కూడా కొత్త కెప్టెన్‌యే కావడంతో పోరులో ఉత్కంఠ నెలకొంది.


ఆడనున్న ఇరు జట్లు:

Rajasthan Royals:
Ajinkya Rahane (captain), Jofra Archer, Jos Buttler, Shreyas Gopal, Krishnappa Gowtham, Heinrich Klaasen, Dhawal Kulkarni, Ben Laughlin, Mahipal Lomror, Sudhesan Midhun, Sanju Samson, Jatin Saxena, D'Arcy Short, Ish Sodhi, Ben Stokes, Rahul Tripathi, Jaydev Unadkat.

Kings XI Punjab:
Ravichandran Ashwin (captain), Chris Gayle, Aaron Finch, KL Rahul, Karun Nair, Mohit Sharma, Mujeeb ur Rahman, Barinder Sran, David Miller, Andrew Tye, Ankit Rajpoot, Axar Patel, Akshdeep Nath, Mayank Agarwal, Manoj Tiwary, Yuvraj Singh, Marcus Stoinis, Mayank Dagar.

Story first published: Monday, May 7, 2018, 1:17 [IST]
Other articles published on May 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X