న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్‌కు తిరుగులేదు: ఢిల్లీపై విజయం, ఈ సీజన్‌లో వరుసగా నాలుగోది

By Nageshwara Rao
KIngs xi Punjab

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం.

144 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ జద్రాన్, ఆండ్రూ టై తలో రెండు వికెట్లు తీసుకోగా... బరిందర్ శ్రాన్‌కు ఒక వికెట్ లభించింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.


ఢిల్లీ బ్యాటింగ్ తీరు సాగిందిలా:

శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు గెలుపు కోసం శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఒకానొక దశలో 42/3తో నిలిచిన ఢిల్లీ 18 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఢిల్లీ మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. ఛేదన ఆరంభంలోనే వరుసగా వికెట్లు చేజార్చుకుని ఢిల్లీ ఇబ్బందుల్లో పడింది.

జట్టు స్కోరు 25 వద్ద యువ ఓపెనర్ పృథ్వీ షా (22) ఔటవగా.. 41 పరుగుల వద్ద గ్లెన్ మాక్స్‌వెల్ (12), 42 పరుగుల వద్ద కెప్టెన్ గౌతమ్ గంభీర్ (4) ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (4) స్పిన్నర్ ముజీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ టై బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా (24) కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఢిల్లీ విజయానికి ప్రస్తుతం 12 బంతుల్లో 21పరుగులు కావాలి.


10 ఓవర్లకు ఢిల్లీ 65/4
ఫిరోజ్ షా కోట్లా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 10 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రిషబ్‌ పంత్‌ (4) పరుగుల వద్ద ముంజీబ్‌ జర్దాన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్‌ (17), డేనియల్‌ క్రిష్టియన్‌ (2) పరుగులతో ఉన్నారు.


6 ఓవర్లకు ఢిల్లీ 48/3
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతోన్న ఢిల్లీ వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు నష్టపోయి 48 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పృథ్వీషా (22; 10 బంతుల్లో 4 ఫోర్లు) కాసేపు అలరించాడు. ఆ తర్వాత గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (12) అనవసర షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. అనంతరం జట్టు స్కోరు 42 పరుగుల వద్ద గౌతమ్ గంభీర్‌ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యువ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌ (1), శ్రేయస్‌ అయ్యర్‌ (5) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఫిరోజ్ షా కోట్లా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టకు యువ ఆటగాడు పృధ్వీ షా(22) మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే రాజ్‌పుత్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి షా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఢిల్లీ 4 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో గంభీర్(2), మాక్స్‌వెల్(12) ఉన్నారు.


ఢిల్లీ విజయ లక్ష్యం 144

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 144 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ శ్రేయస్ అయ్యార్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాస్త దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ ప్లంకెట్ వేసి ఐదో ఓవర్ మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవేశ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్, మయాంక్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు.

కానీ ప్లంకెట్ బౌలింగ్‌లో మయాంక్(21) క్లీన్ బౌల్డ్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మళ్లీ ప్లంకెట్ బౌలింగ్‌లో కరుణ్ నైర్‌(34) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్‌మన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్లంకెట్ మూడు వికెట్లు తీయగా, బౌల్ట్, అవేశ్ ఖాన్ చెరి రెండు వికెట్లు తీశారు. క్రిస్టెయిన్‌కు ఒక వికెట్ లభించింది.


నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి యువరాజ్ సింగ్ (14) పరుగుల వద్ద వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 ఓవర్లకు గాను పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్ (1), కరుణ్ నాయర్ (24) పరుగుతో ఉన్నారు.


12 ఓవర్లకు పంజాబ్ 76/3
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటింగ్‌లో ఊపు తగ్గింది. 12 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యువరాజ్ సింగ్ (10), కరుణ్ నాయర్ (19) పరుగుతో ఉన్నారు.

Punjab

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. లైమ్ ప్లెంకెట్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్ మూడో బంతికి ఆరోన్ ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (21) పరుగుల వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 8 ఓవర్లకు గాను పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. క్రీజులో యువరాజ్ సింగ్ (1), కరుణ్ నాయర్ (13) పరుగుతో ఉన్నారు.


కేఎల్ రాహుల్ ఔట్: 5 ఓవర్లకు పంజాబ్ 43/2
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. లైమ్ ప్లెంకెట్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి దూకుడుగా ఆడుతోన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (23) పరుగుల వద్ద అవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. బౌన్సర్‌గా వచ్చిన బంతిని.. షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా తరలించేందుకు రాహుల్ ప్రయత్నించగా.. అవేష్ చక్కగా బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో 5 ఓవర్లకు గాను పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (16), కరుణ్ నాయర్ (1) పరుగుతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ (2) పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లకు గాను పంజాబ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (15), కేఎల్ రాహుల్ (19) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డెర్ డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఢిల్లీ Vs పంజాబ్ లైవ్ స్కోరు కార్డు

ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. గత మూడు మ్యాచ్‌ల్లో ఒక శతకంతో పాటు రెండు మెరుపు అర్ధశతకాలు బాదిన ఒంటిచేత్తో పంజాబ్‌ని గెలిపించిన క్రిస్‌గేల్ అనారోగ్యం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. అతడి స్ధానంలో డేవిడ్ మిల్లర్‌ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. క్రిస్టెయన్‌కి తప్పించి అతని స్థానంలో లైమ్ ప్లంకెట్‌ని జట్టులోకి తీసుకుంది.

ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. టోర్నీలో ఇప్పటికే ఈ రెండు జట్లూ ఓసారి ఢీకొన్నాయి. ఏప్రిల్ 8న మొహాలి వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడలేదు.

టోర్నీలో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక శతకం, రెండు అర్ధశతకాలతో ఒంటిచేత్తో పంజాబ్‌ని గెలిపించిన క్రిస్‌గేల్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌లో గెలుపొందగా.. ఢిల్లీ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకుంది.

పంజాబ్ జట్టు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ లాంటి విధ్వంసకర ఓపెనర్లతో కళకళలాడుతోంది. ఈ సీజన్‌లో సంచలన విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు దూసుకెళ్తోంది. మరోవైపు పేలవ ఆటతీరుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది.

జట్ల వివరాలు:
ఢిల్లీ డేర్ డెవిల్స్:

గౌతమ్ గంభీర్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, డెనియల్ క్రిస్టెయిన్, విజయ్ శంకర్, రాహుల్ టెవాటియా, లైమ్ ప్లంకెట్, షబాజ్ నదీం, హర్షల్ పటేల్, ట్రెంట్ బౌల్ట్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
లోకేష్ రాహుల్(కీపర్), ఆరోన్ ఫించ్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నైర్, యువరాజ్ సింగ్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, అండ్రూ టై, బరిందర్ స్రాన్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్.

Story first published: Monday, April 23, 2018, 23:48 [IST]
Other articles published on Apr 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X