న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గేల్ హాఫ్‌సెంచరీ: ఈడెన్‌లో కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

By Nageshwara Rao
 KXIP

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు క్రిస్‌గేల్ (62 నాటౌట్: 38 బంతుల్లో 5 ఫోర్లు, 6సిక్సులు), కేఎల్ రాహుల్ (60: 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగడంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

పంజాబ్ విజయంలో ఓ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు. 192 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 96/0తో నిలిచిన దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ని 13 ఓవర్లకి కుదించిన అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్‌ని 125 పరుగులుగా నిర్ణయించారు.

అప్పటికే జోరుమీదున్న పంజాబ్ ఓపెనర్లు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ భారీ సిక్సర్లతో మ్యాచ్‌ని కొనసాగించారు. హాఫ్ సెంచరీ అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు చేరడంతో... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(2)తో కలిసి క్రిస్‌గేల్ 11.1 ఓవర్లోనే పూర్తి చేశాడు.


13 ఓవర్లకు మ్యాచ్ కుదింపు: పంజాబ్ విజయ లక్ష్యం 125

వర్షం కారణంగా మ్యాచ్ సమయం గంట వృధా కావడంతో మ్యాచ్‌ని 13 ఓవర్లకి కుదించిన అంపైర్లు పంజాబ్‌ టార్గెట్‌ని 125గా నిర్ణయించారు. 192 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి దిగిన పంజాబ్ జట్టు 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 96/0తో నిలిచిన దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ని అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో పంజాబ్ విజయానికి 28 బంతుల్లో 29 పరుగులు కావాలి. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.


వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్, గేల్ చక్కటి శుభారంభమిచ్చారు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిపే సమయానికి పంజాబ్ 8.2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కూడా నష్టపోకుండా 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(45), క్రిస్ గేల్(49) పరుగులతో ఉన్నారు. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానం ప్రకారం పంజాబ్‌ 31 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(45), క్రిస్ గేల్(49) పరుగులతో ఉన్నారు. డక్‌వర్త్‌ ప్రకారం ఈ సమయానికి లక్ష్య ఛేదనకు దిగిన జట్టు విజయం సాధించాలంటే 65 పరుగులు సాధించాలి. అయితే పంజాబ్ అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ పరుగులే చేసింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే పంజాబ్‌ విజయం సాధించినట్లే.


పంజాబ్‌ 6 ఓవర్లకు 73/0
ఈడెన్‌ గార్డెన్స్‌లో క్రిస్ గేల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి వరుస బౌండరీలతో హోరెత్తిస్తున్నాడు. కోల్‌కతా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో 6 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (37), క్రిస్‌గేల్‌ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.


పంజాబ్ విజయ లక్ష్యం 192

ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్ క్రిస్‌లిన్ (74; 41 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగడం.. రాబిన్ ఊతప్ప(34; 23 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), దినేశ్ కార్తిక్(43: 28 బంతుల్లో 6ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 192 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్ వేసిన రెండు ఓవర్‌లో ఓపెనర్ సునీల్ నరైన్(1) కరుణ్ నైర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప.. ముజీబ్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది 15 పరుగులు రాబట్టాడు.

ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ వచ్చారు. దూకుడుగా ఆడుతున్న ఊతప్పను ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ రాణా(3) రనౌటయ్యాడు. అయినప్పటికీ లిన్ పట్టు వదలకుండా పరుగులు చేశాడు. అయితే టై వేసిన 16వ ఓవర్‌లో కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి లిన్ పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు బాది 43 పరుగులు చేసి జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ బౌలర్లలో యువ స్పిన్నర్ ఆండ్రూ టై, బరిందర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా... అశ్విన్, ముజీబ్ రెహ్మాన్ తలో వికెట్ తీసుకున్నారు.


క్రిస్ లిన్ ఔట్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ కోల్పోయింది. 41 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి దూకుడుగా ఆడుతోన్న క్రిస్‌లిన్‌ను ఆండ్రూటై పెవిలియన్‌కు పంపాడు. సునీల్ నరైన్ (1), రాబిన్ ఉతప్ప (34), నితీశ్ రాణా (3)లు ఇప్పటికే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (31), ఆండ్రూ రసెల్ (1) క్రీజులో ఉన్నారు.


మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా వరుసగా వికెట్లు కోల్పోతుంది. అంతకముందు రెండో ఓవర్‌లో ఓపెనర్‌ నరైన్‌ వికెట్‌, తొమ్మిదో ఓవర్‌లో రాబిన్ ఊతప్ప వికెట్ కోల్పోయిన కోల్‌కతా పదో ఓవర్‌లో యువ ఆల్ రౌండర్ నితీష్ రాణా(3) వికెట్ కోల్పోయింది. అంకిత్ రాజ్‌పుత్... నితీష్ రాణాను రనౌట్ చేశాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. క్రీజులో దినేశ్ కార్తీక్ (1), క్రిస్ లిన్ (44) పరుగులతో ఉన్నారు.


ఊతప్ప ఔట్: రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి రాబిన్ ఊతప్ప (34) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్ రాణా(2), క్రిస్ లిన్ (43) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతోనన కోల్‌కతా
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ నరైన్‌ వికెట్‌ కోల్పోవడంతో.. జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తున్నారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్‌ లిన్‌ 22(17), ఉతప్ప 24(16) ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి సునీల్ నరేన్ (1) పరుగు వద్ద కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లకు గాను కోల్‌కతా వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రాబిన్ ఊతప్ప (5), క్రిస్ లిన్ (14) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతా-పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

కోల్‌కతా Vs పంజాబ్ మ్యాచ్ లైవ్ స్కోరు కార్డు

కోల్‌కతా తమ టీంలో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ జట్టులో మోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు అంకిత్ రాజ్‌పుత్‌కి చోటు కల్పించారు. టోర్నీని విజయంతో ఆరంభించిన రెండు జట్లూ రెండో మ్యాచ్‌లో ఓడి అనంతరం.. వరుసగా రెండు విజయాలతో ఇప్పుడు మంచి జోరుమీదున్నాయి.

క్రిస్‌గేల్ ఫామ్‌లోకి వచ్చి పరుగుల వరద పారిస్తుండటంతో.. పంజాబ్‌ జట్టు సంతోషంలో ఉంది. మరోవైపు మరోవైపు కోల్‌కతా సమష్టిగా ఆడుతూ విజయాలను సాధిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి విఫలమవుతున్న యువరాజ్ సింగ్‌ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని పంజాబ్ ఆశిస్తోంది.

సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కాడవంతో కోల్‌కతా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోల్‌కతా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించగా.. రెండింటిలో ఓటమి పాలైంది. మరోవైపు పంజాబ్ విషయానికి వస్తే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించగా... ఒక్క దాంట్లో మాత్రమే ఓటమి పాలైంది.

జట్ల వివరాలు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

లోకేష్ రాహుల్(కీపర్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, డేవిడ్ మిల్లర్, మార్కస్ స్టోనిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), అండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ యూఆర్ రహ్మన్.

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీస్ రానా, దినేష్ కార్తీక్(కీపర్/కెప్టెన్), అండ్రే రస్సెల్, శుభ్‌మాన్ గిల్, టామ్ కర్రన్, పియూష్ చావ్లా, శివం మావి, కుల్దీప్ యాదవ్.

Story first published: Saturday, April 21, 2018, 20:43 [IST]
Other articles published on Apr 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X