IPL 2018: MI vs RCB: బెంగుళూరును ముంచేసిన ముంబై, ఐపీఎల్ 11లో రోహిత్ సేన తొలి విజయం

might against formidable Royal

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌లోనే అత్యంత రసవత్తరమైన మ్యాచ్‌కి మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక అయింది. రోహిత్ జట్టు కోహ్లీ సేనపై భారీ ఆధిక్యంతో గెలుపొంది. లీగ్ మొత్తానికి ఆలస్యంగా శుభారంభం పలికింది. ఏ మాత్రం ఆశలు లేకపోయినా మ్యాచ్ ఆఖర్లో కోహ్లీ ఇంకా బౌండరీలపైనే గురి పెట్టి 92 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లు విజృంభించడంతో కోహ్లీ సేన పరుగులు తీసేందుకు తటాపటాయించింది. ఈ క్రమంలో అడపాదడపా కెప్టెన్ పరుగులు తీసేందుకు ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయాడు. దీంతో బెంగుళూరు జట్టు ఇంకా 46 పరుగులు రావాల్సి ఉండగానే ఓవర్లు అయిపోవడంతో మ్యాచ్ ముగించేసింది.


అతి కష్టంపై హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ:

దాదాపు ఐపీఎల్ కెరీర్ లోనే కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడానికి ఇంత కష్టపడి ఉండడే. 40 బంతులు ఆడిన కోహ్లీ 50 స్కోరు చేయగలిగాడు. అదే పిచ్‌పై ముందు బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తే.. బెంగుళూరు జట్టుకు అలా చేయడం తీవ్రతరంగా అనిపిస్తోంది.


పది ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగుళూరు స్కోరు: 76/4

భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు అతి కష్టంపై పరుగులు చేస్తోంది. కోహ్లీ మినహాయించి ఎవ్వరూ కనీసం 20కి మించిన స్కోరు కూడా చేయలేకపోయారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్, బౌలింగ్ లోనూ ఇరగదీస్తోంది. ఆ జట్టు బౌలింగ్ లో కోహ్లీ కూడా ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ముంబై జట్టు ఆటగాళ్లైన కృనాల్ పాండ్యా 3, మిచెల్ మెక్లెన్‌గన్ 2వికెట్లను తీశారు.ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టార్గెట్ 214 పరుగులుగా నిలిపిన ముంబై జట్టు మంచి దూకుడు చూపించింది. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్ లు ఏ మాత్రం తటపటాయించకుండా బౌండరీలనే టార్గెట్ చేసి పరుగుల వర్షం కురిపించారు. ఎవిన్ లూయీస్(65), రోహిత్ శర్మ (94)లు భారీ స్కోరు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు బంతులను ఏ మాత్రం వృథా చేయకుండా ఆడారు. విరాట్ కోహ్లీ జట్టు మ్యాచ్ ఆరంభంలో ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయారు.


సెంచరీకి ఆరు పరుగుల ముందు రోహిత్ అవుట్:
మ్యాచ్ మొదటి నుంచి జాగ్రత్తగా ఆచితూచి ఆడిన రోహిత్ శర్మ.. ఒక్కసారిగా బౌండరీలు చేయడం మొదలుపెట్టాడు. కేవలం 52 బంతుల్లో 94 పరుగులు చేసిన అతను సెంచరీకి దగ్గరలో ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యాడు. రోహిత్ వికెట్ కూడా అండర్‌సన్ ఖాతాలోనే పడింది.


ఐదో వికెట్ పొలార్డ్ కూడా అవుట్:

పొలార్డ్ కేవలం 5 బంతులే ఆడి ఏడు పరుగులతో వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో కొట్టిన షాట్ నేరుగా డివిలియర్స్ చేతిలో పడింది.


నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై జట్టు:
ఎవిన్ లూయీస్ అవుట్ అవడంతో అతని స్థానంలో వచ్చిన కృనాల్ పాండ్యా 15 బంతులు ఆడి 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చాహల్ బౌలింగ్‌లో కేవలం ఒక్క రన్ కోసం పరుగు చేయబోయి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.


లూయీస్ విధ్వంసానికి అండర్‌సన్ అడ్డుకట్ట:

దిగడంతోనే పరుగులు బాదడం మొదలుపెట్టిన ఎవిన్ లూయిస్ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. 11.2ఓవర్లో అండర్ సన్ వేసిన బౌలింగ్ లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


పది ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు 95/2:

మ్యాచ్ మొదలైందో లేదో తొలి రెండు బంతులకే రెండు వికెట్లను కోల్పోయింది ముంబై జట్టు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయస్, రోహిత్ శర్మలు నిలదొక్కుకోవడంతో జట్టు స్కోరు పరుగులు పెట్టింది. లూయిస్(52) 35 బంతుల్లో హాఫ్ సెంచరీ దాటిన స్కోరు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతుండటంతో 23 బంతులకు 32 స్కోరు చేశాడు.


మొదటి 2 బంతులకు 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్:

ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్‌లోముంబై ఇండియన్స్ జట్టు మొదటి 2 బంతులకు 2 వికెట్లు కోల్పోయింది. దీంతో సూర్యకుమార్ యాదవ్(0), ఇషాన్ కిషన్‌(0)లు క్రీజులోకి వచ్చీ రావడంతోనే వెనుదిరిగారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు:

ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన బెంగుళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి కొద్దిసేపట్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇరు జట్లు సమరానికి దిగనున్నాయి. రెండు జట్లలోనూ బలమైన హిట్టర్లు ఉండటంతో మ్యాచ్‌లో ఎక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

బెంగుళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ స్కోరు కార్డు

తొలి సారిగా ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టోర్నీలో ఢీకొంటున్నాయి. గతేడాది విజేతగా నిలిచిన ముంబై జట్టు.. ఈ ఏడాది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలవగా.. బెంగళూరు జట్టు ఓ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టినా ఆఖరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.

బెంగళూరు ఓపెనర్లు మెక్‌కలమ్, డికాక్ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినా.. క్రీజులో నిలిస్తే ఒంటిచేత్తో మ్యాచ్‌ని మలుపుతిప్పగలరు. వారితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, హిట్టర్ ఏబీ డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం. గత సీజన్లతో పోలిస్తే.. బెంగళూరు బౌలింగ్ విభాగం కూడా ఈ ఏడాది మెరుగ్గా ఉంది.

ముంబై ఇండియన్స్ విషయానికొస్తే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్యపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురూ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగైన స్కోరు చేయలేదు.


ఇరు జట్ల ఆటగాళ్లు:

ముంబై జట్టు: Suryakumar Yadav, Evin Lewis, Ishan Kishan (wk), Rohit Sharma (c), Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, Mayank Markande, Jasprit Bumrah, Mustafizur Rahman, Mitchell McClenaghan

బెంగుళూరు జట్టు: Quinton de Kock (wk), Virat Kohli (c), AB de Villiers, Mandeep Singh, Sarfaraz Khan, Corey Anderson, Washington Sundar, Chris Woakes, Umesh Yadav, Yuzvendra Chahal, Mohammed Siraj

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Tuesday, April 17, 2018, 19:33 [IST]
  Other articles published on Apr 17, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more