ఐపీఎల్ 2018: ఒక్క వికెట్ తేడాతో ముంబై జట్టుపై విజయం సాధించి..ధోనీ సేన మీసం తిప్పింది,

Posted By:
wankhede stadium, mumbai

హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టుపై ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్కవికెట్ తేడాతో విజయం సాధించింది.

భారీ అంచనాలతో దిగిన అంబటి రాయుడు (22) మినహా, వాట్సన్(16), రైనా(4) ధోని(5), జడేజా(12)లు తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో జట్టుకు ఆశాకిరణంలా కేదర్ జాదవ్‌, బ్రావో68(30)లు చెలరేగడంతో చెన్నై దూసుకుపోయింది. ఇంకా ఏడు బంతులకు ఏడు పరుగులు చేయాలని పరిస్థితి ఏర్పడింది.

అటువంటి సమయంలో బ్రావో అవుట్‌ కావడంతో మ్యాచ్‌‌లో గందరగోళం ఏర్పడింది. చివరి ఓవర్లో కేదార్‌ జాదవ్‌ మిగిలిన పరుగుల్ని చేయడంతో చెన్నై విజయం సాధించింది.

భారీ అంచనాల మధ్య మొదలైన తొలి మ్యాచ్ లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు అతి కష్టంపై పరుగులు రాబట్టింది. పిచ్ నేపథ్యం ముందుగానే పసిగట్టిన మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా బ్యాటింగ్ తీసుకున్న రోహిత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

Chennai Super Kings vs Mumbai Indians 2018 Match 1 Score, కామెంటరీ

ఆరంభ వేడుకల అనంతరం ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభమైంది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత సీజన్లలో ఈ రెండు జట్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల్లో రెండు సార్లు తలపడగా, రెండు సార్లు ముంబై విజయం సాధించింది.

ధోనీ మాట్లాడుతూ:
టాస్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ 'ఇది మంచి బ్యాటింగ్ పిచ్. తిరిగి ఎల్లో జెర్సీలో ఆడటం చాలా సంతోషంగా ఉంది. కానీ మేం భావోద్వేగానికి గురి కావడం లేదు. విదేశీ ఆటగాళ్లు వుడ్, తాహీర్, బ్రావో, వాట్సన్ మా జట్టులో ఆడుతున్నారు' అని అన్నాడు.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ:
రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఆడడం పట్ట హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ కోసం పూర్తి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. గతంలో జరిగే మ్యాచ్‌లు పరిగణనలోకి తీసుకోకుండా ఆడనున్నామని తెలిపాడు. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నామని, ఇద్దరు ఆల్ రౌండర్స్‌ హార్థిక్, కృనాల్‌తో పాటు, మెక్‌క్లాగాన్, బుమ్రా, ముస్తాఫిజుర్ జట్టులో ఉన్నారు. మయాంక్ మార్ఖాండే మా జట్టులో కొత్త ఆటగాడంటూ జట్టు పట్ల విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. గతేడాది ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలిచి మూడో సారి టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో రైజింగ్‌ పుణెతో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో విజయం సాధించి మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

మరొకవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గత పదేళ్లుగా ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించిన హర్భజన్ సింగ్ ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు. ముంబై, చెన్నై రెండు జట్లు ఐపీఎల్లో విజయవంతమైన జట్లు. అయితే రెండేళ్ల నిషేధం అనంతరం తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న చెన్నై తన తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించాలని ఆశిస్తోంది.

జట్ల వివరాలు:

చెన్నై:
అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేష్ రైనా, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్/కీపర్), డ్వెన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహీర్, మార్క్ వుడ్.

ముంబై:
ఇషాన్ కిషన్, ఎవిన్ లివీస్, రోహిత్ శర్మ(కెప్టెన్), ఎస్ యాదవ్, కెరియన్ పొలార్డ్, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఎం రహ్మాన్, మెక్‌క్లాగాన్, మయాంక్ మార్ఖాండేరికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 7, 2018, 19:48 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి