న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్థాన్‌కు గడ్డుకాలం: ఓడితే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే!

By Nageshwara Rao
IPL 2018 Live Score RR vs KXIP: IPL Dream 11 for RR vs KXIP

హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మంగళవారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది.

టోర్నీలో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు మూడింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరాలంటే ఇకపై ఆడే ఐదు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇండోర్ వేదికగా గత ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

 రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే!

రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే!

ఇప్పుడు అదే జట్టుపై తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడితే.. ఇక ప్లేఆఫ్ ఆశల్ని రాజస్థాన్‌ వదులుకోవాల్సిందే. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌‌ని కొనసాగిస్తూ గత రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌కి మెరుపు ఆరంభాలిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తేలిపోతున్నారు.

తక్కువ స్కోర్లకే పరిమితం అవుతున్న రాజస్థాన్

తక్కువ స్కోర్లకే పరిమితం అవుతున్న రాజస్థాన్

ముఖ్యంగా సంజు శాంసన్, కెప్టెన్ రహానె, బెన్‌స్టోక్స్, రాహుల్ త్రిపాఠిలు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించలేకపోతున్నారు. దీంతో రాజస్థాన్ తక్కువ స్కోర్లకే పరిమితం అవుతుండటంతో ప్రత్యర్ధి జట్టు విజయాలను సొంతం చేసుకుంటుంది. ఇక, బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్, జయదేవ్ ఉనాద్కత్‌ ఆశించిన మేర రాణించలేకపోతున్నారు.

గత మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఓటమి

గత మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఓటమి

రాజస్థాన్ బౌలింగ్ కారణంగా టోర్నీలో చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లాడి ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్ మెరుపు ఆరంభాల్ని ఇస్తున్నారు.

అద్భుతమైన బౌలింగ్ లైనప్ కలిగిన పంజాబ్

అద్భుతమైన బౌలింగ్ లైనప్ కలిగిన పంజాబ్

దీంతో పంజాబ్ భారీ స్కోరు చేస్తోంది. ఇక మిడిలార్డర్‌లో కరుణ్ నాయర్, స్టాయినిస్, అక్షర్‌పటేల్, మయాంక్ అగర్వాల్ జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక, టోర్నీలో అద్భుతమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్లలో పంజాబ్ ఒకటి. స్పిన్నర్లు ముజీబ్, అశ్విన్ చక్కటి ప్రదర్శన చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Story first published: Tuesday, May 8, 2018, 17:58 [IST]
Other articles published on May 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X