న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదలెట్టేసింది.. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో..

IPL 2018: KKR begin camp sans Karthik, Kallis

హైదరాబాద్: మరో కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్‌ మెగా టోర్నీకి ఎనిమిది ఫ్రాంచైజీలు ఘనంగా ముస్తాబవుతున్నాయి. ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలనే కసిలో జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సైతం ప్రాక్టీస్‌ సెషన్స్‌ను మొదలు పెట్టేసింది.

కోల్ కత్తా జట్టు ఆటగాళ్లంతా కలిసి జాధవ్‌పూర్‌ యూనివర్సిటీలోని మైదానంలో ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన వార్మప్‌ సెషన్స్‌లో వైస్‌ కెప్టెన్‌ రాబిన్‌ ఉతప్ప సహా 11 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులు శుభ్‌మన్‌ గిల్‌, నాగర్‌కోటి, వినయ్‌ కుమార్‌, ఇషాంక్‌ జగ్గీ తదితరులు ఉన్నారు.

గౌతమ్‌ గంభీర్‌ సొంత జట్టు ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆ స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ నాయకత్వ బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలో కార్తీక్‌ కూడా ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటాడని ఫ్రాంఛైజీ నిర్వాహకులు తెలిపారు.

ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ ఏప్రిల్‌ 7న ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఏప్రిల్‌ 8న కోల్‌కత్తా వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Story first published: Tuesday, March 20, 2018, 14:36 [IST]
Other articles published on Mar 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X