న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పథకం ప్రకారమే.. రాహుల్‌ని అవుట్ చేశా: బుమ్రా

IPL 2018: Executed My Plans Perfectly, Says Bumrah After Stunning Performance

హైదరాబాద్: చేధనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపుదిశగా పరుగులు తీస్తోంది. క్రీజులో ఉండి జట్టును ఎలాగైనా గెలిపించాలనే తపనతో కనిపిస్తున్నాడు రాహుల్. బుమ్రా టార్గెట్ ఫిక్స్ అయింది. రాహుల్‌ను అవుట్ చేయాల్సిందే. ఈ క్రమంలో 18 ఓవర్ ముగిశాక బౌలింగ్ చేసిన బుమ్రా చేతికి చిక్కాడు రాహుల్. దీంతో 94 పరుగుల వద్ద రాహుల్ అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బుమ్రా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని పక్కా ప్రణాళికతోనే ఔట్ చేశానని ముంబై ఇండియన్స్‌ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు.

బుధవారం రాత్రి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు విజయానికి చివర్లో 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఓపెనర్ రాహుల్ (94) క్రీజులో ఉండటంతో.. పంజాబ్ గెలుపుపై ధీమాతో ఉంది. కానీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన బుమ్రా.. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి.. తెలివైన బంతితో రాహుల్‌ని ఔట్ చేసేశాడు. దీంతో.. మ్యాచ్ అనూహ్యంగా ముంబై వైపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. రాహుల్ ఔట్‌తో ఒత్తిడిలో పడిన పంజాబ్ 13 పరుగులు మాత్రమే రాబట్టి 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.

'ఐపీఎల్ 2018 సీజన్‌ ఆరంభం నుంచి అత్యుత్తమంగా ఆడుతున్నాడని మాకు తెలుసు. కాబట్టి.. జట్టు సమావేశంలో ప్రణాళికల గురించి చర్చించాం. క్రీజులో ఎవరు ఒత్తిడిలో ఉన్నారనేది ప్రధానాంశంగా మాట్లాడుకున్నాం. ఒత్తిడికి లోనవుతున్నారా లేదా అనేది పట్టించుకోను. కేవలం బౌలింగ్‌పై మాత్రమే దృష్టి పెడ‌తాను. మన వద్ద పక్కా ప్రణాళిక ఉన్నప్పుడు.. దాన్ని సరిగ్గా అమలు చేస్తే చాలు. పంజాబ్‌పై నేను చేసింది అదే' అని బుమ్రా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 15 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తాజా విజయంతో మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది.

Story first published: Thursday, May 17, 2018, 17:11 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X