న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీకి కొత్త కెప్టెన్‌తో కలొచ్చొంది.. మరి జట్టు రాతో..?

IPL 2018: Delhi Daredevils Must Fix Top Order Troubles Against KKR

హైదరాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించి రెండు సార్లు ట్రోఫీని గెలిచిన గౌతం గంభీర్ జట్టుని వదిలి ఢిల్లీ జట్టుకు చేరాడు. ఐపీఎల్ అభిమానులంతా గంభీర్ విజయం వైపు నడిపిస్తాడు అని ఆశపడి ఎదురుచూసిన వారందరికీ.. నిరుత్సాహమే మిగిలింది. ఇప్పటికే సగం టోర్నీ పూర్తయినా.. ఇంకా సర్దుబాట్లతోనే సరిపెడుతోంది. ఆ జట్టు చివరిగా ఆడినా నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఘోర పరాజయాల్ని చవిచూసి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది.

గంభీర్ తప్పుకోగా.. శ్రేయాస్ అయ్యర్‌కి

గంభీర్ తప్పుకోగా.. శ్రేయాస్ అయ్యర్‌కి

వరుస ఓటములకి బాధ్యత వహిస్తూ బుధవారం జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ తప్పుకోగా.. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కి నాయకత్వ బాధ్యతలను ఢిల్లీ ఫ్రాంఛైజీ అప్పగించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకి కోల్‌కతాతో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో ఢిల్లీ మ్యాచ్ ఆడనుంది.

ప్రతి మ్యాచ్‌లో సత్తాచాటాల్సి

ప్రతి మ్యాచ్‌లో సత్తాచాటాల్సి

ఇప్పటికే మూడు జట్లు పది పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరువవుతుండగా.. ప్రస్తుతం ఒక విజయంతో రెండు పాయింట్లతో ఉన్న ఢిల్లీ జట్టు ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే.. ప్రతి మ్యాచ్‌లో సత్తాచాటాల్సి సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ మినహా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో నిరాశపరుస్తున్న ఢిల్లీ జట్టు.. మళ్లీ సొంతగడ్డపై విజయంతో పుంజుకోవాలని ఆశిస్తోంది.

ఫర్వాలేదనిపించిన ఆవేశ్ ఖాన్

ఫర్వాలేదనిపించిన ఆవేశ్ ఖాన్

బ్యాటింగ్‌లో జేసన్ రాయ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మినహా ఎవరూ ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. హిట్టర్లు మాక్స్‌వెల్.. ఓపెనర్ గంభీర్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఫామ్‌‌లేమీతో ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్‌లో మాత్రం బెంగళూరుతో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఫ్లంకెట్, అవేష్ ఖాన్ ఫర్వాలేదనిపించారు.

మెరుగైన ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌

మెరుగైన ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌

మరోవైపు టోర్నీ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఓపెనర్ క్రిస్‌లిన్, హిట్టర్లు రాబిన్ ఉతప్ప, నితీశ్ రానా, ఆండ్రీ రసెల్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లోనూ సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్‌లు చక్కగా రాణిస్తున్నారు. గత శనివారం టోర్నీలో చివరి మ్యాచ్‌ ఆడిన కోల్‌కతాకి ఆరు రోజులు విశ్రాంతి దొరకడంతో.. ఆటగాళ్లు ఉత్సాహంగా బరిలోకి దిగనున్నారు.

Story first published: Friday, April 27, 2018, 17:31 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X