న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోట్లాలో చెన్నైకి షాకిచ్చిన ఢిల్లీ: నిరాశకు గురయ్యానని ధోని

By Nageshwara Rao
IPL 2018, DD vs CSK: MS Dhoni Disappointed After Chennai Super Kings Loss To Delhi Daredevils

హైదరాబాద్: ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో ఓటమి తనను ఎంతో నిరాశకు గురి చేసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెల్లడించాడు. శుక్రవారం రాత్రి ఫిరోజ్ షా కోట్లా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మేం ఇంకాస్త బాగా ఆడాల్సి ఉంది

మేం ఇంకాస్త బాగా ఆడాల్సి ఉంది

మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ‘మేం ఇంకాస్త బాగా ఆడాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో వి​కెట్‌ చాలా నెమ్మదించింది. దానికి తోడు ఢిల్లీ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. అయినా వికెట్‌ ఎలా ఉంటుందో ముందుగానే ఊహించడం కష్టం. ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉంటుంది. మరోసారి ఇదిగో ఇలా రివర్స్‌ అవుతుంది' అని ధోని అన్నాడు.

డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ మెరుగుపడాలి

డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ మెరుగుపడాలి

'ఓపెనర్లపై పూర్తిగా ఆధారపడకుండా మిడిలార్డర్ రాణించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ల సేవలను వినియోగించుకోలేదు. రానున్న మ్యాచ్‌లలో వారికి అవకాశం లభించవచ్చు. కాబట్టి అందుకు వారు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలి. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ బాగా మెరుగుపడాల్సి ఉంది' అని ధోని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇప్పటికే ప్లేఆఫ్‌ చేరిన చెన్నై

ఇప్పటికే ప్లేఆఫ్‌ చేరిన చెన్నై

ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్‌ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఓటమి ఊహించని షాకే. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ జట్టు చెన్నైపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో 18 పాయింట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాప్‌లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ధోని జట్టుకు నిరాశే

ధోని జట్టుకు నిరాశే

అయితే రన్‌రేట్‌ ప్రకారం సీఎస్‌కే మెరుగైన స్థానంలో ఉండటంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచితే టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించాలని ఆశించిన ధోని జట్టుకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ హర్షల్ పటేల్ (36 నాటౌట్), విజయ్ శంకర్ (36 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను బౌలర్లు సమష్టిగా రాణించి 128/6కే పరిమితం చేశారు.

Story first published: Saturday, May 19, 2018, 13:42 [IST]
Other articles published on May 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X