న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్, క్వాలిఫయిర్-1: CSK vs SRH: ఫైనల్ బెర్తు ఎవరిదో?

By Nageshwara Rao
IPL 2018: CSK vs SRH: Preview: Playing 11s, Timings, Live Streaming & More

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ లీగ్ దశ ముగియడంతో మరో అంకం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా చివరి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ప్లేఆఫ్స్‌కు చేరాలన్న కింగ్స్‌ పంజాబ్‌ ఆశలు నెరవేరలేదు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరగా... ఆదివారం నాటి మ్యాచ్‌లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ప్లేఆఫ్ప్‌కు చేరాయి. దీంతో ప్లేఆఫ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు ఈ నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ప్లేఆఫ్‌లో భాగంగా ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

1
43467

క్వాలిఫయర్‌-1లో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్‌‌కి ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్ల మధ్య మంగళవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో పాటు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

ఇరు జట్లు 18 పాయింట్లతో సమానంగా

ఇరు జట్లు 18 పాయింట్లతో సమానంగా

ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో చెరో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 18 పాయింట్లు సమానంగా ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా క్వాలిఫయిర్-1లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్తుని ఖరారు చేసుకోగా, ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది.

క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టుకు మరో అవకాశం

క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టుకు మరో అవకాశం

అదెలాగని అనుకుంటున్నారా? క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడుతుంది కాబట్టి. ఈ మ్యాచ్ శుక్రవారం (మే 25)న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. క్వాలిఫయిర్-1లో తలపడనున్న రెండు జట్లు ఒకటే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను లీగ్‌ దశలో రెండు సార్లు ఓడించిన చెన్నై ఈ మ్యాచ్‌లో ఓడించి ఫైనల్ బెర్తుని ఖరారు చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.

లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి

లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి

ఇక, సన్ రైజర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్ దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. రెండు జట్లలో అటు సీనియర్‌ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు సైతం సత్తా చాటుతున్నారు. బౌలర్లకు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చెన్నై అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది.

రాయుడు, రైనా, ధోనిపైనే ఆధారపడ్డ చెన్నై

రాయుడు, రైనా, ధోనిపైనే ఆధారపడ్డ చెన్నై

చెన్నై జట్టు బ్యాటింగ్‌లో అంబటి రాయుడు, ధోని, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవోలు కీలకం కానున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై బౌలర్లు ఏమంత మెరుగైన ప్రదర్శన కనబర్చలేదు. షేన్ వాట్సన్, బ్రావోలు ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సందర్భాలు అనేకం.

సన్‌రైజర్స్ బౌలర్లు ఏం చేస్తారో?

సన్‌రైజర్స్ బౌలర్లు ఏం చేస్తారో?

ఇక, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌, శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, శ్రీవాత్స్‌ గోస్వామి ప‍్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. బౌలింగ్‌ విభాగంలో చెన్నై కంటే సన్‌రైజర్స్‌ కాస్త మెరుగ్గా ఉంది. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ వరుస విజయాల్లో బౌలర్లు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

చెన్నై సూపర్‌కింగ్స్: Mahendra Singh Dhoni (Capt), Suresh Raina, Ravindra Jadeja, Faf Du Plessis, Harbhajan Singh, Dwayne Bravo, Shane Watson, Ambati Rayadu, Deepak Chahar, K M Asif, Kanish Seth, Lungi Ngidi, Dhruv Shorey, Murali Vijay, Sam Billings, Mark Wood, Kshtiz Sharma, Monu Kumar, Chaitanya Bishnoi, Imran Tahir, Karn Sharma, Shardul Thakur, N agadeesan, David Willy.

సన్‌రైజర్స్ హైదరాబాద్: Kane Williamson (Capt), Shikhar Dhawan, Manish Pandey, Bhuvneshwar Kumar, Wriddhiman Saha, Siddharth Kaul, Deepak Hooda, Khaleel Ahmed, Sandeep Sharma, Yusuf Pathan, Shreevats Goswami, Ricky Bhui, Basil Thampi, T Natarajan, Sachin Baby, Bipul Sharma, Mehdi Hasan, Tanmay Agarwal, Alex Hales, Carlos Brathwaite, Rashid Khan, Shakib Al Hasan, Mohammad Nabi and Chris Jordan.

రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం.

Story first published: Monday, May 21, 2018, 17:37 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X