అసలేం జరిగింది?: గంభీర్‌తో గొడవకు వచ్చిన తివారీ

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో ఎటువంటి వివాదాలు లేకుండా సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆటగాళ్లు తమ తమ సైతం హద్దుల్లో ఉండి ఆటను అస్వాదించడం చూశాం. అయితే బుధవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అనంతరం 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆటగాళ్లు కోల్‌కతా ఆటగాళ్లలో గంభీర్ (62), రాబిన్ ఊతప్ప (87)తో అర్ధసెంచరీలు నమోదు చేశారు.

మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన కోల్‌కతాకు ఇది ఆరో విజయం.

 IPL 2017: Watch How Gautam Gambhir, Manoj Tiwary Got Involved In A Verbal Spat During RPS-KKR Match

అయితే కోల్‌కతా ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో గౌతం గంభీర్‌తో మనోజ్‌ తివారీ వాగ్వాదానికి దిగాడు. గంభీర్‌ దగ్గరకు వచ్చి మాటల యుద్ధానికి దిగాడు. గంభీర్‌ కూడా తన దైన శైలిలో బదులివ్వడంతో తివారీ తన స్థానానికి వెళ్లిపోయాడు. అయితే వీరిద్దరూ ఇలా వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు.

2015 రంజీ ట్రోఫీలో ఢిల్లీ, బెంగాల్‌ జట్ల మధ్య ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మ్యాచ్‌ జరిగింది. అప్పుడు బెంగాల్‌ కెప్టెన్‌గా ఉన్న మనోజ్‌ తివారీ, ఢిల్లీ ఆటగాడు గౌతం గంభీర్‌ మధ్య తొలిసారి గొడవ జరిగింది. తివారీపై చేయి చేసుకునేందుకు వెళ్తున్న క్రమంలో అడ్డుపడిన అంపైర్‌ శ్రీనాథ్‌ను కూడా గంభీర్‌ తోసేశాడు.

క్రికెట్‌లో అంపైర్‌ను తాకడాన్ని ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. దీనిని పరిగణనలోకి తీసుకుని సదరు క్రికెటర్‌పై నిషేధం కూడా విధిస్తారు. ఈ ఘటన మనన్ శర్మ బౌలింగ్‌లో బెంగాల్ ఆటగాడు పార్థసారథి భట్టాచార్య అవుటైన తర్వాత క్యాప్ ధరించి క్రీజులోకి బ్యాటింగ్ చేసేందుకు మనోజ్ తివారీ వచ్చినప్పుడు చోటు చేసుకుంది.

క్రీజులోకి బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన మనోజ్ తివారీ బౌలింగ్ వేస్తున్న ఢిల్లీ బౌలర్‌ను ఆపి మరీ, డ్రెస్సింగ్ రూమ్ వైపు తన హెల్మెట్ తీసుకురమ్మని సిగ్నల్ ఇవ్వడంతో సమయాన్ని వృథా చేస్తుండటంతో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న గంభీర్.. మనోజ్ తివారీతో వాగ్వాదానికి దిగాడు.

Story first published: Friday, April 28, 2017, 17:40 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి