న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 10, మ్యాచ్ 8: బెంగళూరు Vs పంజాబ్ మ్యాచ్ హైలెట్స్

ఐపీఎల్ పదో సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ ఓపెనర్ హసీమ్ ఆమ్లా (58 నాటౌట్: 38 బంతుల్లో 4x4, 3x6), కెప్టెన్ మాక్స్‌వెల్ (43 నాటౌట్: 22 బంతుల్లో 3x4, 4x6) చెలరేగడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ లక్ష్యాన్ని చేధించింది.

IPL 2017: Match 8: Highlights: Bangalore (RCB) Vs Punjab (KXIP)

అంతకముందు ఏబీ డివిలియర్స్ (89 నాటౌట్: 46 బంతుల్లో 3x4, 9x6) విధ్వంసక రీతిలో బ్యాటింగ్ చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఏబీ మినహా మిగత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ని బెంగళూరు బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఓపెనర్ మనన్ వోహ్రా (34)ని జట్టు స్కోరు 62 వద్ద మిల్స్ పెవిలియన్‌కి పంపగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ వెంటనే పెవిలియన్‌కు చేరినా కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సులు) నాటౌట్‌ నిలిచాడు..

దీంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ లక్ష్యాన్ని చేధించింది. బెంగుళూరు బౌలర్లలో తైమాల్‌ మిల్స్‌, ఇమ్రాన్‌ తహీర్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ విజయం సాధించగా.. మూడో మ్యాచ్‌ ఆడిన బెంగళూరుకు ఇది రెండో ఓటమి.

మ్యాచ్ హైలెట్స్:

* ఐపీఎల్ 10వ సీజన్‌లో షేన్ వాట్సన్ వరుసగా మూడోసారి టాస్ గెలిచాడు.
* గత రెండు మ్యాచ్‌ల్లో గేల్ నిరాశపరచడంతో రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు.
* ఐపీఎల్‌లో షేన్ వాట్సన్ ఎదుర్కొన్న నాలుగు సార్లు కూడా అక్షర పటేల్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు.
* ఆర్సీబీ ఓపెనర్ విష్ణు వినోద్ 7 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.
* ఐపీఎల్‌లో 2013 నుంచి ఆడుతున్న పంజాబ్ పేసర్ సందీప్ శర్మ పవర్ ప్లేలో 32 వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ తో కలిసి ఈ రికార్డుని పంచుకున్నాడు.
* ఐపీఎల్ 10వ సీజన్‌లో వందో సిక్స్ ఈ మ్యాచ్‌లో నమోదైంది. టి నటరాజన్ వేసిన 9వ ఓవర్‌లో మన్దీప్ సింగ్ ఈ సిక్సు బాదాడు.
* 46 బంతులను ఎదుర్కొన్న ఏబీ డివిలియర్స్ 9 సిక్సులు బాదాడు.
* 46 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా ఏబీ డివిలియర్స్ నిలిచాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు చేయగలిగింది.
* చివరి 5 ఓవర్లలో బెంగళూరు జట్టు 77 పరుగులు రాబట్టింది. తొలి 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 71.
* ఐపీఎల్‌లో మ్యాక్స్ వెల్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
* 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో పంజాబ్ జట్టు ఆటగాడు హషీమ్ ఆమ్లా అర్ధసెంచరీని నమోదు చేశాడు.
* పంజాబ్ జట్టు కెప్టెన్ 22 బంతుల్లో 4 పోర్లు, 3 సిక్సుల సాయంతో 43 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X