పవర్ ప్లేలో మెరిసిన రాహుల్ త్రిపాఠి: మ్యాచ్ 41 హైలెట్స్

Posted By:

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

మిడిలార్డర్‌లో గ్రాండ్‌హోం (19 బంతుల్లో 36), సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30నాటౌట్‌) రాణించడంతో పూణెకు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Kolkata Vs Pune; Rahul Tripathi shines for RPS

దీంతో కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్‌ను మేడిన్ చేసి వికెట్ తీసిన ఉనాద్కత్ ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి ఓవర్‌ను మేడిన్ చేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. దీంతో కోల్‌కతా పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్సన్.. పూణె బౌలర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఒక వైపు వికెట్లుపడుతున్న కెప్టెన్ గంభీర్ దాటిగా ఆడాడు. సుందర్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కోట్టిన గంభీర్ క్యాచ్ అవుటయ్యాడు.

దీంతో పవర్ ప్లేలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో కోల్‌కతా నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు చేసింది.

కోల్‌కతా Vs పూణె మ్యాచ్ హైలెట్స్:

* ఈ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా పరుగుల ఖాతా తెరవకముందే తొలి ఓవర్‌లో ఓపెనర్‌ నరైన్‌ వికెట్‌ కోల్పోయింది.
* పూణె బౌలర్ ఉనాద్కత్ తొలి ఓవర్‌ను మేడిన్ చేయడంతో పాటు వికెట్ తీశాడు.
* తద్వారా ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి ఓవర్‌ను మేడిన్ చేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
* షెల్డన్ జాక్సన్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
* జాక్సన్ కాలు స్టంప్స్‌ను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
* 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంభీర్ పెవిలియన్‌కు చేరాడు.
* మనీష్ పాండే 32 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
* ఐపీఎల్ పదో సీజన్‌లో పవర్ ప్లే తర్వాత మనీష్ పాండే 313 పరుగులు చేశాడు.
* ఐదో వికెట్‌కు గ్రాండ్‌హోం (19 బంతుల్లో 36), సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30నాటౌట్‌) 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో జయదేవ్ ఉనాద్కత్ 21 పరుగులు సమర్పించుకున్నాడు.
* డెత్ ఓవర్లలో సూర్య కూమార్ యాదవ్ (16 బంతుల్లో 30నాటౌట్‌) అద్భుత ప్రదర్శన చేశాడు.
* పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ త్రిపాఠి నిలిచాడు.
* 238 పరుగులతో వార్నర్ రికార్డుని అధిగమించాడు.
* ఐపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో త్రిపాఠి చేసిన 18 బంతుల్లో 47 పరుగులు రికార్డుగా నిలిచింది.
* పవర్ ప్లేలో రాహుల్ త్రిపాఠి స్ట్రైక్ రేట్ 171గా ఉంది. ఇది ఐపీఎల్‌లో అత్యధికం.
* ఈ మ్యాచ్‌లో 11 పరుగుల వద్ద అవుటై రహానే మరోసారి నిరాశ పరిచాడు.

Story first published: Wednesday, May 3, 2017, 23:35 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి