ఐపీఎల్: బెన్ స్టోక్స్ సెంచరీ, గుజరాత్‌పై పూణె ఘన విజయం

Posted By:

హైదరాబాద్: పూణె వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 167 పరుగులు చేసింది.

stokes

ఐపీఎల్‌లో పుణె జట్టుకు గుజరాత్ లయన్స్‌పై ఇదే తొలి విజయం. ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగాడు. 63 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. ఓ పక్క కీలక ఆటగాళ్లంతా అవుటైనప్పటికీ స్టోక్స్ నిలకడగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించాడు.

పూణె విజయ లక్ష్యం 162

పూణె వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో పూణె విజయ లక్ష్యం 162 పరుగులుగా నిర్దేశించింది.

గుజరాత్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సులు), బ్రెండన్ మెక్‌కల్లమ్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సుల)తో రాణించారు. ఈ క్రమంలో పూణె బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో గుజరాత్‌ లయన్స్‌ టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా (8), ఆరోన్ ఫించ్ (13) పరుగులతో నిరాశ పరిచారు. 10వ ఓవర్‌ వేసిన తాహిర్ తన స్పిన్ మంత్రంతో రెండు కీలక వికెట్లు తీశాడు. పదో ఓవర్‌ ఐదో బంతికి అరోన్‌ ఫించ్‌(13), ఆరో బంతికి అప్పుడే క్రీజులోకి వచ్చిన డ్వేన్‌ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

డ్వేన్ స్మిత్ను కూడా డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (29), రవీంద్ర జడేజా (19), జేమ్స్ ఫల్కనర్ (6), ప్రదీప్ సాంగ్వాన్ (1), బాసిల్ థంపి (2) పరుగులు చేశారు. పుణె బౌలర్లలో ఉనాడ్కట్, ఇమ్రాన్ తహీర్ చెరో 3 వికెట్లు తీయగా, శార్దూల్ థాకూర్, డానియేల్ క్రిస్టియన్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పూణె

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పూణె ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఫెర్గూసన్‌, దీపక్‌ చాహర్‌ స్థానంలో బెన్‌ స్టోక్స్‌, శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు స్టీవ్ స్మిత్ తెలిపాడు. మరోవైపు జట్టులో రెండు మార్పులు చేసినట్లు లయన్స్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా తెలిపాడు. ఆండ్రూ టై, ఇర్ఫాన్‌ పఠాన్‌ స్థానంలో డ్వేన్‌ స్మిత్‌, ప్రదీప్‌ సంగ్వాన్‌ ఆడుతున్నట్లు పేర్కొన్నాడు.

శనివారం (ఏప్రిల్ 29)న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి పూణె మంచి ఊపులో ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన పూణె 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. గుజరాత్ విషయానికి వస్తే ముంబైతో జరిగిన మ్యాచ్‌‌‌లో సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది.

రైజింగ్ పుణె సూపర్‌జెయింట్: అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మనోజ్ తివారి, ధోనీ(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డానియేల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, జయ్‌దేవ్ ఉనడ్కట్, శార్దూల్ థాకూర్, ఇమ్రాన్ తహీర్.

గుజరాత్ లయన్స్: ఇషాన్ కిషన్, బ్రెండన్ మెక్‌కల్లమ్, సురేశ్ రైనా(కెప్టెన్), ఆరోన్ ఫించ్, డ్వెయిన్ స్మిత్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జేమ్స్ ఫాల్క్‌నర్, అంకిత్ సోనీ, ప్రదీప్ సంగ్వాన్, బాసిల్ తంపి.

Story first published: Monday, May 1, 2017, 20:03 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి