టాప్‌లో ముంబై: చివరి ఓవర్ ఉత్కంఠ, మ్యాచ్ 38 హైలెట్స్

Posted By:

హైదరాబాద్: ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్‌ 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి ఓవర్‌ను షేన్ వాట్సన్‌ బౌలింగ్ వేశాడు. మొదటి నాలుగు బంతులు సింగిల్స్ తీశారు. అయితే ఐదో బంతికి రోహిత్ ఫోర్ బాది మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేశాడు.

IPL 2017: Match 38: Highlights: Mumbai Vs Bangalore

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లనగాన్ మూడు వికెట్లు తీయగా.. క్రునాల్ పాండ్య రెండు, కర్ణ్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీశారు. తాజా విజయంతో ముంబై 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ముంబై Vs బెంగళూరు మ్యాచ్ హైలెట్స్:

* టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
* బెంగళూరు తరుపున కోహ్లీ, మన్‌దీప్ ఓపెనింగ్ చేశారు.
* మొదటి ఓవర్‌లో బౌండరీతో మన్ దీప్ ఐపీఎల్‌లో 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
* 14 బంతుల్లో 20 పరుగులు చేసిన కోహ్లీ అవుటయ్యాడు.
* 27 బంతుల్లో 43 పరుగులు చేసిన ఏబీ డివిలియక్స్ అవుటయ్యాడు.
* కేదార్ జాదవ్, పవన్ నేగిలు బెంగళూరుకి 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
* ఆఖరి ఓవర్‌లో బెంగళూరు మూడు వికెట్లను కోల్పోయింది.
* ముంబై తరుపున మెక్లనగాన్ అత్యుత్తమ ప్రదర్శన (3/34, 4 ఓవర్లు) కనబర్చాడు.
* అంకిత్ చౌదరి తొలి ఓవర్‌లో తొలి బంతికి పార్దీవ్ పటేల్ వెనుదిరిగాడు.
* రెండో వికెట్‌కు జోస్ బట్లర్, నితీశ్ రాణా 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
* రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Monday, May 1, 2017, 22:36 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి