ఐపీఎల్: సూపర్ ఓవర్‌లో ముంబైని గెలిపించిన బుమ్రా

Posted By:

హైదరాబాద్: రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ టై అయ్యింది. దీంతో ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ గుజరాత్ బౌలర్ ఫాల్కనర్ వేసిన సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ లయన్స్‌ ఆరు పరుగులే చేయడంతో ముంబై విజయం సాధించింది. దీంతో ముంబై బౌలర్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో సూపర్ ఓవర్‌లో ముంబై విజయం సాధించింది.

MI

సూపర్ ఓవర్ అంటే?

ముంబై, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ టైగా ముగియడంతో ఇరు జట్లు సూపర్ ఓవర్‌ ఆడుతున్నారు. ఇరు జట్లు చెరో ఓవర్ ఆడతాయి. ఒక్కో జట్టు తరుపున ఇద్దరు బ్యాట్స్‌మన్ ఆడతారు. ప్రత్యర్ధి జట్టు నుంచి ఒక బౌలర్ బౌలింగ్ వేస్తాడు. సెకండ్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు తొలి బ్యాటింగ్ చేస్తుంది. జోస్ బట్లర్, కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌కు దిగుతున్నారు. గుజరాత్ లయన్స్ తరుపున ఆండ్రూ టై గాయపడటంతో ఫాల్కనర్ బౌలింగ్ వేశాడు.

ముంబై, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ టై

రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ టై అయ్యింది. చివరి బంతికి ముంబై ఒక పరుగు చేయడంతో ఇరు జట్లు సమమయ్యాయి. ఓపెనర్ పార్ధివ్ పటేల్(70) దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ 154 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఇర్ఫాన్ పఠాన్ వేసిన 20వ ఓవర్‌లో 10 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయి ముంబై ఆలౌటైంది. మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఐపీఎల్ పదో సీజన్‌లో తొలిసారి ఓ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌కు ఆటగాళ్లు సిద్ధమౌతున్నారు.

ముంబై విజయ లక్ష్యం 154

ముంబై ఇండియన్స్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యం 154 పరుగులుగా నిర్దేశించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఎంచుకున్న గుజరాత్ లయన్స్ మెకల్లమ్(6) వికెట్‌ను వెంటనే కోల్పోయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో సురేశ్ రైనా(1), అరోన్ ఫించ్(0), దినేశ్ కార్తీక్(2)లు కూడా వెనుదిరిగారు. దీంతో ఓపెనర్‌గా వచ్చిన యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

పేస్‌, స్పిన్‌ అని తేడాలేకుండా మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 48 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా (28), ఫాల్కనర్ (21), ఆండ్రూ టై(25) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో క్రునాల్ పాండ్యా 3 వికెట్లు తీసుకోగా, లసిత్ మలింగ, జస్ప్రిత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ లయన్స్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.

నాథూ సింగ్‌ స్థానంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు సురేశ్ రైనా తెలిపాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో పఠాన్‌కు ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం. మరోవైపు ముంబై ఇండియన్స్‌ జట్టులో రెండు మార్పులు చేసినట్లు ఆ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

Gujarat win the toss and decide to bat first

మిచెల్ జాన్సన్‌, కర్ణ్‌శర్మ స్థానంలో లసిత్‌ మలింగ, కృనాల్‌ పాండ్యను ఎంపిక చేసినట్లు రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో అంతకముందు జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ గుజరాత్‌కు ఎంతో కీలకం కావడంతో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. మరొకవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ మరొక గెలుపును సొంతం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.

ముంబై ఇండియన్స్:

P Patel, J Buttler, N Rana, RG Sharma, K Pollard, H Pandya, K Pandya, H Singh, M McClenaghan, L Malinga, J Bumrah

గుజరాత్ లయన్స్:
I Kishan, B McCullum, S Raina, A Finch, D Karthik, R Jadeja, J Faulkner, I Pathan, A Tye, B Thampi, A Soni

Story first published: Saturday, April 29, 2017, 20:05 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి