ఐపీఎల్: ఈడెన్‌లో కోల్‌కతాకు తిరుగులేదు, ఢిల్లీపై విజయం

Posted By:

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా ఆటగాళ్లలో కెప్టెన్ గౌతం గంభీర్ (52 బంతుల్లో 71 నాటౌట్; 11 ఫోర్లు), రాబిన్ ఉతప్ప(33 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించారు.

Kolkata Knight Riders win the toss and elect to field

వీరిద్దరూ కలిసి 108 పరుగుల భాస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ సీజన్‌లో కోల్‌కతా మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతా‌కు ఇది ఏడో విజయం కాగా, ఢిల్లీకి ఐదో ఓటమి కావడం విశేషం.

కోల్‌కతా విజయ లక్ష్యం 161

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా విజయ లక్ష్యం 161 పరుగులుగా నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ సంజూ శాంసన్ అర్ధ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ సెంచరీని పూర్తి చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కరుణ్ నాయర్(15) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

Kolkata Knight Riders win the toss and elect to field

అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మరో ఓపెనర్ సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద సంజూ శాంసన్ (60; 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కోల్‌కతా బౌలర్ కౌల్టర్‌ నైల్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి బంతికి రిషబ్‌ పంత్‌(6) వెనుదిరిగాడు.

ఆ తర్వాత ఢిల్లీ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ (47)ను అదే ఓవర్లో ఐదో బంతికి కౌల్టర్‌ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్ త్రుటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ మోరిస్ (11), కోరీ ఆండర్సన్ (2) పరుగులతో నిరాశపరిచారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంకిత్ భావ్నే (12 నాటౌట్) పరుగులతో ఫరవాలేదనిపించాడు. చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 29 పరుగులు మాత్రమే చేయడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్‌ నైల్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్, సునీల్ నరేన్ చెరో వికెట్ తీసుకున్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా:

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింటిలో విజయం సాధించి కోల్‌కతా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే సొంతగడ్డపై కోల్‌కతాని ఎదుర్కోవడం కష్టమే. ఢిల్లీ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఢిల్లీ తుది జట్టులో అంకిత్ భావ్నేకి చోటు కల్పించారు. ఈ మ్యాచ్ ద్వారా అతడు ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.

జట్ల వివరాలు:
ఢిల్లీ డేర్ డెవిల్స్:
S Samson, S Iyer, K Nair, R Pant, A Bawne, C Anderson, C Morris, K Rabada, P Cummins, A Mishra, Z Khan

కోల్‌కతా నైట్ రైడర్స్:
S Narine, G Gambhir, R Uthappa, M Pandey, Y Pathan, S Jackson, C de Grandhomme, C Woakes, N Coulter-Nile, U Yadav, K Yadav

Story first published: Friday, April 28, 2017, 15:50 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి