కోల్‌కతా అలవోక విజయం: కోల్‌కతా Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా మరో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో ఏడో విజయం సాధించింది. తాజా విజయంతో 14 పాయింట్లను సొంతం చేసుకుని పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా ఆటగాళ్లలో కెప్టెన్ గౌతం గంభీర్ (52 బంతుల్లో 71 నాటౌట్; 11 ఫోర్లు), రాబిన్ ఉతప్ప(33 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించారు.

Kolkata Vs Delhi; DD slump after good batting start

వీరిద్దరూ కలిసి 108 పరుగుల భాస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ సీజన్‌లో కోల్‌కతా మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతా‌కు ఇది ఏడో విజయం కాగా, ఢిల్లీకి ఐదో ఓటమి కావడం విశేషం.

కోల్‌కతా Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్:

* ఢిల్లీ ఓపెనర్లు సంజూ శాంసన్, కరుణ్ నాయర్‌లు తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఓపెనర్ సంజూ శాంసన్ 38 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
* ఢిల్లీ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టిన కరుణ్ నాయర్ 15 పరుగుల వద్ద అవుటయ్యాడు.
* 34 బంతుల్లో 47 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
* 6 పరుగుల వద్ద అవుటై ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు.
* ఢిల్లీ జట్టు తరుపున అంకిత్ భావ్నే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
* రనౌట్ అవడానికి ముందు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
* క్రిస్ మోరిస్ 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు.
* ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సులు బాదారు.
* 4 ఓవర్లు వేసిన నాథన్ కౌల్టర్ నైలీ 3 వికెట్లు తీసి 34 పరుగులిచ్చాడు.
* కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, సునీల్ నరేన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Story first published: Friday, April 28, 2017, 20:59 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి