కోహ్లీసేన ఘోర ఓటమి: పూణె Vs బెంగళూరు మ్యాచ్ హైలెట్స్

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో బెంగళూరు బ్యాటింగ్‌లో మరోసారి చేతులేత్తేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. సొంత మైదానంలో గుజరాత్ లయన్స్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాట్స్‌మెన్లు నిలవలేకపోయారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లును చేజార్చుకుండా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గుజరాత్‌ బౌలర్‌ ఆండ్రూ టై (3/12) అద్భుత ప్రదర్శనతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు గాను 134 పరుగులకు ఆలౌటైంది.

Match 31 Highlights: Bangalore Vs Gujarat; RCB post anotherlow total

ఓపెనర్లు క్రిస్ గేల్, కోహ్లిలు తమ శైలికి భిన్నంగా ఆచితూచి బ్యాటింగ్ ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఓ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికి గేల్ కూడా అవుటయ్యాడు. దాంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికి క్రిస్ గేల్ కూడా అవుటయ్యాడు. దాంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌ దూకుడుగా ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. థంపీ వేసిన ఆరో ఓవర్లో జాదవ్‌ వరుసగా మూడు ఫోర్లు బాది స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

భారీ షాట్లతో చెలరేగుతున్న జాదవ్‌‌ను జడేజా బౌల్డ్‌ చేశాడు. అనంతరం మన్‌దీప్‌సింగ్‌(8), డివిలియర్స్‌(5) భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనవసర పరుగుకోసం యత్నించి డివిలియర్స్ అవుటయ్యాడు. చివర్లో పవన్ నేగీతో కలిసి అంకిత్ చౌదరి(15 నాటౌట్) రాణించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌటైంది.

పూణె Vs బెంగళూరు మ్యాచ్ హైలెట్స్:

* ఈ సీజన్‌లో బెంగళూరు మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. కోహ్లీ 10, గేల్ 8, డివిలియర్స్ 5 పరుగులకే పెవిలియన్‌కు చేరారు.
* 19 బంతుల్లో 32 పరుగులు చేసిన పవన్ నేగి బెంగళూరు జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
* పవన్ నేగి చేసిన 32 బంతుల్లో మూడు బౌండరీలు, రెండు సిక్సులు ఉన్నాయి.
* కేదార్ జాదవ్ 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. భారీ షాట్లతో చెలరేగుతున్న జాదవ్‌‌ను జడేజా బౌల్డ్‌ చేశాడు.
* ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై (3/12) మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు.
* 4 ఓవర్లు వేసిన జడేజా రెండు వికెట్లు తీసి 28 పరుగులిచ్చాడు.
* 30 బంతుల తర్వాత బెంగళూరు ఆటగాడు అంకిత్ చౌదరి 19వ ఓవర్‌లో బౌండరీ బాదాడు.
* బెంగళూరు సొంతమైదానమైన చిన్నసామి స్టేడియంలో బెంగళూరు కేవలం 4 సిక్సులు మాత్రమే బాదింది.
* ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఆలౌటైంది.
* ఈ మ్యాచ్‌తో పదేళ్ల ఐపీఎల్‌లో బెంగళూరు 14 సార్లు ఆలౌటైంది. దీంతో రాజస్ధాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల సరసన నిలిచింది.
* ఏడుగురు బెంగళూరు ఆటగాళ్లు డబుల్ డిజిట్ ను అందుకోలేకపోయారు.
* గుజరాత్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ 100వ ఐపీఎల్ గేమ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 పరుగుల వద్ద అవుటై నిరాశపరిచాడు.

Story first published: Thursday, April 27, 2017, 23:06 [IST]
Other articles published on Apr 27, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి