అద్భుతమైన ఫీల్డింగ్‌తో దడ పుట్టించిన జడేజా (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. అద్భుతమైన డైవ్‌లతో మెరుపులు మెరిపిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. సోమవారం రాత్రి పూణెతో జరిగిన మ్యాచ్‌లో అరోన్ ఫించ్ కళ్లు చెదిరే రీతిలో పూణె ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు.

ఇక చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూణె విజయానికి చివరి ఓవరి 11 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి వచ్చిన తరుణంలో గుజరాత్ ఫీల్డర్లు చిన్న తప్పిదం కూడా చేయకుండా జట్టును గెలిపించుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించారు.

అయితే పూణె ఆటగాడు బెన్ స్టోక్స్ చివరి వరకు క్రీజులో ఉండి సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. పుణె విజయానికి చివరి 11 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో బెన్‌ స్టోక్స్ క్రీజులో ఉన్నాడు. థంపీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో స్టోక్స్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు.

బంతి దాదాపుగా బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లిపోయింది. ఈ సమయంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా మెరుపు వేగంతో దూసుకొచ్చి బౌండరీని అడ్డుకున్నాడు. జడేజా వచ్చిన వేగానికి బౌండరీ లైన్ దాటిపోయి వెళ్లేపోయేవాడే. కానీ జడేజా తనను తాను నియంత్రించుకుంటూ బంతిని అడ్డుకున్న తీరు అద్భుతం.

ఆ బంతిని ఆపేందుకు వేగంగా మరోవైపు నుంచి వచ్చిన ఫీల్డర్ ఇషాన్ కిషన్ జడేజాని ఢీకొనే ప్రమాదాన్ని పసిగట్టి వేగంగా బౌండరీలైన్‌ లోపలికి దూకేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు పరుగులు రావాల్సిన చోట.. రెండే రావడంతో స్టోక్స్‌పై ఒత్తిడి పెరిగింది. గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా మహ్మద్ కైఫ్‌ ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, May 2, 2017, 18:22 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి