ఐపీఎల్ 2018: డేవిడ్ వార్నర్‌ స్థానంలో అలెక్స్‌ హేల్స్‌

Posted By:
IPL 11: Sunrisers Hyderabad name Alex Hales as replacement for David Warner

హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్ 2018లో ఆడనున్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్‌ స్థానంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్ అలెక్స్‌ హేల్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంపిక చేసుకుంది.

ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యం తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అలెక్స్ హేల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయాడు.

అయితే టీ20ల్లో హేల్స్‌కు మంచి రికార్డు ఉండటం, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఇతడే ది బెస్ట్ కావడంతో సన్‌రైజర్స్‌ హేల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. 52 అంతర్జాతీయ టీ20ల్లో 31.65 యావరేజితో 1456 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్‌లో అండర్స్‌న్‌ గాయంతో దూరం అవ్వడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

అలెక్స్ హేల్స్‌ కంటే ముందు శ్రీలంక ఆటగాడు కుశాల్‌ పెరీరాను తీసుకోవాలని సన్‌రైజర్స్‌ భావించింది. అయితే, అతడు టెస్టు జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నట్లు చెప్పడంతో హేల్స్‌తో సంప్రదింపులు జరపడం... అతడు అంగీకరించడంతో వార్నర్ స్థానాన్ని సన్‌రైజర్స్ అతడితో భర్తీ చేసింది.

కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్మిత్‌, వార్నర్‌లను ఐపీఎల్‌లోకి ఐపీఎల్‌కు అనుమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

వీరిద్దరి స్థానాల్లో వేరే ఆటగాళ్లను తీసుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించింది. అంతేకాదు కెప్టెన్‌‌గా డేవిడ్ వార్నర్ తప్పుకోవడంతో న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. ఏప్రిల్‌ 7న ఈ ఏడాది ఐపీఎల్‌ 11వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

డేవిడ్ వార్నర్‌ లేని సన్‌రైజర్స్‌ను ఊహించుకోవడం హైదరాబాద్‌ అభిమానులకు కష్టంగా ఉంది. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డు ఉంది. 2014లో 528 పరుగులు, 2015లో 562, 2016లో 848, 2017లో 641 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున గత నాలుగు సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ ప్రదర్శన ఇది.

డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2016 టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 52.63 యావరేజి, 147.71 స్ట్రైక్‌ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 16:39 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి