న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాయం కారణంగా ట్రోఫీకి దూరమైన అశ్విన్.. కొత్త కెప్టెన్‌గా..

Injured Ashwin ruled out of Deodhar Trophy

హైదరాబాద్: కొత్త కెప్టెన్‌కు కష్టమొచ్చింది. ఐపీఎల్‌లో పలు చర్చల అనంతరం కింగ్స్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్‌ను రెండు రోజుల తేడాతోనే దేవదర్ ట్రోఫీకి భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకున్నారు. ఐపీఎల్‌కు ముందే ఈ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతా అశ్విన్ కెప్టెన్సీలో మ్యాచ్ చూద్దామని ఆశపడ్డారు. కానీ, గాయం కారణంగా ట్రోఫీ నుంచి తప్పుకున్న అశ్విన్ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు.

మార్చి 4నుంచి 9వరకు ధర్మశాల వేదికగా జరగనున్న దేవదర్ ట్రోఫీకి భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా అశ్విన్‌కు బదులు 'అంకిత్ బావె'ను ఎంచుకున్నారు. జార్ఖండ్‌కు ఎడమ చేతి వాటం స్పిన్నర్ షెహ్‌బాజ్ నదీమ్ అశ్విన్ స్థానంలో కొనసాగనున్నాడు. ఇంతకుముందు వరకు ఇరానీ కప్ కోసం ఆడబోయే జట్టు మిగిలిన భారత జట్టులో ఉన్నాడు.

భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా విధులు నిర్వహించనున్న అంకిత్ బావె భారత్-బీ జట్టులోని ఆటగాడు. బీ జట్టు నుంచి తీసుకోవడంతో ఇతనికి బదులుగా అక్షదీప్ నాథ్ అనే ఆటగాడ్ని ఏ నుంచి బీ జట్టులోకి తీసుకున్నారు.

దేవదర్ ట్రోఫీలో ఆడనున్న భారత జట్లు:

India 'A':
Ankit Bawne (Capt), Prithvi Shaw, Unmukt Chand, Shubman Gill, Ricky Bhui, Suryakumar Yadav, Ishan Kishan, Krunal Pandya, Mohammad Shami, Navdeep Saini, Basil Thampi, Kulwant Khejroliya, Amandeep Khare, Rohit Rayudu, Shahbaz Nadeem.

India 'B':
Shyreas Iyer, Ruturaj Gaikwad, A Easwaran, Akshdeep Nath, Manoj Tiwary, Siddesh Lad, KS Bharat, Jayant Yadav, D Jadeja, Hanuma Vihari, Siddharth Kaul, Khaleel Ahmed, Harshal Patel, Umesh Yadav, Rajat Patidar.

Rest of India (For Irani Cup): Karun Nair (Captain), Prithvi Shaw, A Easwaran, R Samarth, Mayank Agarwal, Hanuma Vihari, KS Bharat, Ravindra Jadeja, Jayant Yadav, Shabaz Nadeem, Anmolpreet Singh, Siddharth Kaul, Ankit Rajpoot, Navdeep Saini, Ateet Sheth.

Story first published: Thursday, March 1, 2018, 11:05 [IST]
Other articles published on Mar 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X