న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండోసారి: విజ్డన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ

By Nageshwara Rao
Indian skipper Virat Kohli is Wisden Cricket of the Year

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్డన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీకి ఈ అవార్డు దక్కడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది కూడా కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.

తద్వారా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కోహ్లీ సమం చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2008, 2009లో వరుసగా ఈ అవార్డుకి ఎంపకయ్యాడు. ఇక, మహిళల విభాగంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఈ అవార్డు దక్కింది.

వీరిద్దరితో పాటు పాటు గతేడాది వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లాండ్‌ మహిళల జట్టులోని ముగ్గురు క్రీడాకారిణీలు హీదర్‌ నైట్‌, అన్య, నాట్‌ స్కీవర్‌‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఎంపిక చేసిన ఈ అవార్డులను ప్రకటించారు.

గతేడాది టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 2818 పరుగులు చేసి ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కోహ్లీ 10 టెస్టుల్లో 1,059 పరుగులు, 26 వన్డేల్లో 1,460 పరుగులు, 10 టీ20ల్లో 299 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Indian skipper Virat Kohli is Wisden Cricket of the Year

గతేడాది వన్డేల్లో 11 సెంచరీలు చేయగా, టెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌.. గతేడాది వరల్డ్ కప్‌లో జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించింది.

అలాగే గతేడాది వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విజ్డన్ అవార్డుల్లో ఆప్ఘనిస్థాన్ స్పిన్న సంచలనం రషీద్ ఖాన్‌కు టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. వీరితో పాటు ఎసెక్స్ పేసర్ జామీ పోర్టర్, వెస్టిండిస్ ఓపెనర్ షాయ్ హోప్ కూడా ఉన్నారు.

Story first published: Wednesday, April 11, 2018, 18:40 [IST]
Other articles published on Apr 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X