న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత జట్టులో ఆరుగురు సీమర్లను గతంలో ఎన్నడూ చూడలేదు'

By Nageshwara Rao
Indian pace attack has unusual variety and depth: Alastair Cook

హైదరాబాద్: గతంతో పోల్చుకుంటే భారత పేస్ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ అన్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరిస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆరంభం కానుంది.

ఈ నేపథ్యంలో అలెస్టర్ కుక్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ "టీమిండియాకు మెరుగైన బౌలింగ్ వనరులున్నాయి. ముఖ్యంగా వైవిధ్యమైన పేస్ బౌలర్లు జట్టులో ఉండటం వారి పటిష్ఠతను తెలియజేస్తోంది. పేస్ బౌలింగ్‌తో భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది" తెలిపాడు.

"గత పదేళ్లుగా నేను భారత్‌తో ఆడుతున్నాను. ఇప్పుడు ఉన్నట్లు ఐదు లేదా ఆరుగురు సీమర్లను గతంలో ఎప్పుడు చూడలేదు. ధావన్, పుజారా ఫామ్‌లేమితో ప్రస్తుతం టీమిండియా టాపార్డర్ ఒకింత సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, వారిద్దరూ కుదురుకుంటే పరుగుల వరద పారిస్తారు" అని కుక్ పేర్కొన్నాడు.

ఫామ్‌లో లేకపోవడం అనేది తాత్కాలికం

ఫామ్‌లో లేకపోవడం అనేది తాత్కాలికం

"ఫామ్‌లో లేకపోవడం అనేది తాత్కాలికం. వారు గతంలో ఎన్నోసార్లు జట్టు తరఫున పరుగులు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే టీమిండియా ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడున్నర వారాల తర్వాత బరిలోకి దిగుతుండటంతో ఫ్రెష్‌గా ఫీలవుతున్నాను" అని అలెస్టర్ కుక్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి

ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి

ఇదిలా ఉంటే భారత్‌తో బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనున్న తొలి టెస్టు.. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. ఇంగ్లాండ్‌కు ఇది 1000వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఈ అరుదైన ఘనతను అందుకుంటున్న తొలి జట్టుగా రికార్డు సాధించనుంది. మార్చి 1877లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన ఇంగ్లండ్ ఇప్పటివరకు 999 మ్యాచ్‌లు పూర్తి చేసింది.

ఎడ్జిబాస్టన్‌లో 50 టెస్టులాడిన ఇంగ్లాండ్

ఎడ్జిబాస్టన్‌లో 50 టెస్టులాడిన ఇంగ్లాండ్

ఇందులో 357 టెస్టులు గెలువగా, 297 మ్యాచ్‌ల్లో ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక, తొలి టెస్టు మ్యాచ్ జరిగే ఎడ్జ్‌బాస్టన్‌లోనే ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు 50 టెస్టులు ఆడింది. 1902లో ఆసీస్‌తో ఇక్కడ మొదటి టెస్టు జరిగింది. 27 మ్యాచ్‌ల్లో నెగ్గగా, 8 టెస్టులో ఓడి.. 15 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మరోవైపు 1932 జూన్‌లో భారత్‌తో తొలి టెస్టు ఆడిన ఇంగ్లాండ్.. అప్పటి నుంచి ఇప్పటివరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది.

ఎడ్జిబాస్టన్‌లో ఇంగ్లాండ ఆధిక్యం 5-0గా

ఎడ్జిబాస్టన్‌లో ఇంగ్లాండ ఆధిక్యం 5-0గా

ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 117 టెస్టులు జరుగ్గా ఇందులో ఇంగ్లండ్ 43 మ్యాచ్‌ల్లో గెలువగా 25 టెస్టుల్లో ఓడింది. స్వదేశంలో ఇంగ్లండ్ 30 మ్యాచ్‌లు గెలిస్తే, టీమిండియా ఆరుసార్లు మాత్రమే విజయం సాధించింది. 21 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో ఇరుజట్ల మధ్య ఆరు టెస్టులు జరిగితే ఇందులో ఇంగ్లాండ్ 5-0తో ఆధిక్యంలో ఉంది.

Story first published: Tuesday, July 31, 2018, 12:38 [IST]
Other articles published on Jul 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X