న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ మాజీ క్రికెటర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు'

Indian flight attendant claims Arjuna Ranatunga sexually harassed her

న్యూ ఢిల్లీ: కొద్ది రోజుల కిందట మొదలై లైంగికంగా వేధింపులకు గురైన మహిళల ఆవేదనను బయటపెడుతోంది #మీటూ ఉద్యమం. నెలలుగా.. సంవత్సరాలుగా పాతపడిపోయిన నిజాలను సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు. పలు రంగాల నుంచి అంటే సినీ, జర్నలిజం రంగాల్లో పెద్దలుగా గుర్తింపు పొందిన ఎంతో మంది ఆవేదనను పంచుకునేందుకు వేదికగా మారింది.

<strong>ధోనీకి వన్డేల్లోనూ స్థానం దూరం కానుందా..??</strong>ధోనీకి వన్డేల్లోనూ స్థానం దూరం కానుందా..??

లంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ తీరు

లంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ తీరు

క్రీడా రంగంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారంటూ గుత్తా జ్వాల తన #మీటూ స్టోరిని బహిర్గతం చేశారు. అయితే క్రీడా రంగానికి సంభందించి మరో నిజం తాజాగా బయటికొచ్చింది. ఓ ఎయిర్‌హోస్టెస్‌ శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ తనతో వ్యవహరించిన తీరు గురించి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చి

హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చి

ముంబైలోని హోటల్‌ జూహు సెంటర్‌ ఎలివేటర్‌లో ఇండియన్‌, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్‌ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను మాయమైపోయింది. అయితే అప్పుడే హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర నిలబడి ఉన్నాడు.'

అంతలోనే సమీపంగా వచ్చి అసభ్యంగా

అంతలోనే సమీపంగా వచ్చి అసభ్యంగా

'నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా విష్‌ చేశాను. కానీ అంతలోనే నాకు సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టాను. నీ పాస్‌పోర్టు క్యాన్సిల్‌ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్‌ రిసెప్షన్‌లో కంప్లైంట్‌ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్‌ మ్యాటర్‌. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు.

పెట్రోలియం శాఖ మంత్రిగా అర్జున రణతుంగ:

పెట్రోలియం శాఖ మంత్రిగా అర్జున రణతుంగ:

అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును #రణతుంగ పేరిట ఇండియన్‌ ఎయిర్‌హోస్టెస్‌ బహిర్గతం చేశారు. కాగా, శ్రీలంకకు వరల్డ్‌ కప్‌(1996) అందించిన కెప్టెన్‌గా రికార్డుకెక్కిన అర్జున రణతుంగ ప్రస్తుతం ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.

Story first published: Wednesday, October 10, 2018, 15:32 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X