ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకున్న టీమిండియా

Posted By: Subhan
India wins 5th ODI at Port Elizabeth, dethrones South Africa from ICC ODI top spot

హైదరాబాద్: భారత్ మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మొదటి స్థానంలో పదిలపరచుకొంది. ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడిన భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత్ ముంగిట పలు రికార్డులు నమోదు కాగా ఇది ప్రధానమైనది.

India seal historic series win, top spot in ICC ODI rankings
సిరీస్ దక్కేసినట్టే:

సిరీస్ దక్కేసినట్టే:

సఫారీ గడ్డ మీద తొలిసారి వన్డే సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టుకు మరో ఘనత దక్కింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం పదిలమైంది. పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో గెలిచిన కోహ్లి సేన చివరి మ్యాచ్‌లో ఓడినా సరే నంబర్ 1 హోదాలోనే కొనసాగనుంది.

ఇప్పుడు పదిలమైన స్థానం:

ఇప్పుడు పదిలమైన స్థానం:

ఆరు వన్డేల సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టు ఖాతాలో 119 పాయింట్లు ఉండగా... 4-1 ఆధిక్యం సాధించాక... 122 పాయింట్లు చేరాయి. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచాక భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. కానీ మరో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం ద్వారా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

 భారత్ నంబర్ వన్‌గా ఆరో సారి:

భారత్ నంబర్ వన్‌గా ఆరో సారి:

నంబర్ 1 జట్టుగా వన్డే సిరీస్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 118 పాయింట్లు ఉన్నాయి. చివరి వన్డేలోనూ భారత్ నెగ్గితే అగ్రస్థానం మరింత పదిలం అవుతుంది. టీమిండియా మొదటిసారి 2013లో వన్డేల్లో నంబర్ 1 జట్టుగా నిలిచింది. టీమిండియా టెస్టుల్లోనూ నంబర్ 1 హోదాలో ఉన్న సంగతి తెలిసిందే.

వన్డే సిరీస్ గెలవడం తొలిసారి:

వన్డే సిరీస్ గెలవడం తొలిసారి:

1992 నవంబరు నుంచి పాతికేళ్లుగా సఫారీ గడ్డపై టీమిండియాకు విజయం దక్కింది లేదు. ఏడు టెస్టు సిరీస్‌లయ్యాయి. ఏడు వన్డే సిరీస్‌లు ముగిశాయి. ఎన్నడూ ఏ ఫార్మాట్లోనూ భారత్‌ సిరీస్‌ విజేతగా నిలిచింది లేదు. ఎట్టకేలకు కోహ్లీసేన కలను నెరవేర్చింది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై సిరీస్‌ విజయం సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, February 14, 2018, 13:18 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి