న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్ ఓటమి టీమిండియా మరిచిపోవాల్సిన రోజు

By Nageshwara Rao
India will bounce back after Lords defeat, expects Dean Jones

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఆగస్టు 18న జరగనున్న మూడో టెస్టులో టీమిండియా పుంజుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

1
42376
భారత్‌ పుంజుకుంటుందని భావిస్తున్నా

భారత్‌ పుంజుకుంటుందని భావిస్తున్నా

లార్డ్స్ టెస్టు అనంతరం డీన్ జోన్స్ మాట్లాడుతూ "భారత్‌ పుంజుకుంటుందని భావిస్తున్నా. లార్డ్స్‌లో బంతి చాలా స్వింగ్‌ అయింది. ఇది టీమిండియాకు మరిచిపోవాల్సిన రోజు. ఇప్పుడు పుంజుకోవడం చాలా కీలకం. అదే కదా క్రీడల్లోని గొప్పదనం. ఒక్క ఘోర పరాజయం అంటే అర్థం జట్టంతా చెడ్డదని కాదు" అని అన్నాడు.

అప్పుడప్పుడూ అలా జరుగుతుంది

అప్పుడప్పుడూ అలా జరుగుతుంది

"పరిస్థితులను బట్టి అప్పుడప్పుడూ అలా జరుగుతుంది. కొన్నిసార్లు మనం టెక్నిక్‌ను ఎక్కువగా విశ్లేషిస్తాం. దాని గురించి అతిగా ఆలోచిస్తే సహజంగా ఆడలేం. ఇప్పుడు భారత్‌ ఆత్మవిశ్వాసం పెంచుకొని పుంజుకోవాలి. మూడేళ్లలో ఎప్పుడూ లేనంతగా లార్డ్స్‌లో బంతి స్వింగ్‌ అయింది" అని డీన్ జోన్స్ పేర్కొన్నాడు.

ఆసియా కప్‌ ఎంతో కీలకం

ఆసియా కప్‌ ఎంతో కీలకం

ఇంగ్లాండ్‌ బౌలర్లు జేమ్స్ అండర్సన్‌, ఇతర బౌలర్లు అద్భుతంగా బంతులేశారని డీన్ జోన్స్ తెలిపాడు. ప్రస్తుత హెడ్ కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ జట్టు సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపాలని సూచించాడు. క్రికెటర్‌పై పనిభారం ఎప్పుడూ ఉంటుందని అయితే ఇంగ్లాండ్‌ సిరీస్‌ కన్నా ఆసియా కప్‌ ఎంతో కీలకమని డీన్ జోన్స్ వెల్లడించాడు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 0-2తో వెనుకబడిన భారత్

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 0-2తో వెనుకబడిన భారత్

లార్డ్స్ టెస్టులో ఓటమితో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా 0-2తో వెనకబడి ఉంది. ఇరు జట్ల మధ్య . నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఆగస్టు 18న భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, August 14, 2018, 13:44 [IST]
Other articles published on Aug 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X