న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌ పేస్ విభాగంలో ఒక్కరికే అవకాశం: కోహ్లీ

ICC World T20 2020 : Virat Kohli Reveals Only One Spot Up For Grabs In Pace For ICC World T20 2020
India vs West Indies: Virat Kohli said Only one spot up for grabs in pace attack for T20 World Cup

హైదరాబాద్‌: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా పేస్‌ విభాగంలో చేరడానికి మరొక్కరికే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం జరుగనున్న తొలి టీ20లో భారత్-వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. తొలి టీ20 సందర్భంగా హైదరాబాద్‌లో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

పురుషుల వన్డేకు మహిళా మ్యాచ్‌ రిఫరీ.. చరిత్ర సృష్టించనున్న ఆంధ్ర మాజీ క్రికెటర్‌ లక్ష్మి!!పురుషుల వన్డేకు మహిళా మ్యాచ్‌ రిఫరీ.. చరిత్ర సృష్టించనున్న ఆంధ్ర మాజీ క్రికెటర్‌ లక్ష్మి!!

ఒక్కరికే అవకాశం:

ఒక్కరికే అవకాశం:

'టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటి నుండే జట్టును పటిష్టం చేసుకోవాలి. జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. బౌలింగ్ విభాగంలో ఒక్క స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. దాదాపుగా ముగ్గురు చోటు ఖాయం చేసుకున్నారు. ఇదో ఆరోగ్యకరమైన పోటీ. జట్టులో చోటు కోసం ఎక్కువ మంది పోటీపడుతుండటం పెద్ద సమస్యేమీ కాదు. భువనేశ్శ్వర్, బుమ్రా అనుభవమున్న బౌలర్లు. టీ20ల్లో వారు నిలకడగా రాణిస్తున్నారు. దీపక్‌ చాహర్‌ కొత్త బౌలర్ అయినా.. బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు' అని కోహ్లీ తెలిపాడు.

షమీ సూపర్:

షమీ సూపర్:

'మహ్మద్‌ షమీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. షమీ లయ అందుకొని చెలరేగితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాకు ఉపయోగకరం. కొత్త బంతితో వికెట్లు తీయగలడు. యార్కర్లు కూడా బాగా వేస్తాడు. ముగ్గురు సీమర్లతో పాటు మరొ స్థానం కోసం యువకులు పోటీపడుతున్నారు. అందరూ బాగా బౌలింగ్‌ చేస్తున్నారు. ఇదో మంచి అవకాశం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

 చాహర్‌కే అవకాశం:

చాహర్‌కే అవకాశం:

కోహ్లీ మాటలు బట్టి చూస్తే.. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌కు చోటు ఖాయమని తెలుస్తోంది. బుమ్రాకు తోడు భువీ, షమీ టీ20 జట్టులో చేరితే టీమిండియా బౌలింగ్‌ దుర్భేద్యంగా మారుతుంది. కండరాల గాయంతో విశ్రాంతి తీసుకున్న భువీ.. విండీస్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. భువీ వెస్టిండీస్‌లో ఈ ఏడాది ఆగస్టులో చివరి టీ20 ఆడగా.. షమీ 2017లో చివరి మ్యాచ్‌ ఆడాడు. ప్రస్తుత ఫామ్ చూస్తే దీపక్ చాహర్ టీ20 జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

Story first published: Friday, December 6, 2019, 11:38 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X