న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరు కదా?: సాహాతో పంత్‌కు పోలిక

IND vs WI 2019 : Wriddhiman Saha Should Play 2nd Test Instead Of Rishabh Pant Says Syed Kirmani
India vs West Indies: Saha should play 2nd Test instead of Pant: Syed Kirmani

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా రెండో టెస్టులోనైనా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలని భారత మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీ అభిప్రాయపడ్డాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రిషబ్ పంత్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరంటూ రిషబ్‌పంత్‌ను ఉద్దేశించి సయ్యద్ కిర్మాణి వ్యాఖ్యానించారు. రిషబ్ పంత్‌కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌.. వృద్ధిమాన్ సాహాను పట్టించుకోకపోవడంపై కూడా కిర్మాణి స్పందించారు. పంత్‌తో సమానమైన అవకాశాలను సాహాకు ఇవ్వాలని అన్నారు.

<strong>సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం క్రీడాకారులకు వరంగా మారింది</strong>సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం క్రీడాకారులకు వరంగా మారింది

పంత్‌ టాలెంట్‌ ఉన్న క్రికెటరే

పంత్‌ టాలెంట్‌ ఉన్న క్రికెటరే

"పంత్‌ టాలెంట్‌ ఉన్న క్రికెటరే. కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. అతనికి నేర్చుకుంటూ ఎదగడానికి కూడా చాలా సమయం ఉంది. అటువంటి సందర్భంలో సాహాను నిర్లక్ష్యం చేయడం తగదు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో సాహాకు అవకాశం ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసింది" అని కిర్మాణి అన్నారు.

సాహా మంచి వికెట్‌ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్‌ కూడా

సాహా మంచి వికెట్‌ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్‌ కూడా

"వృద్ధిమాన్ సాహా మంచి వికెట్‌ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్‌ కూడా. ఆ విషయాన్ని మరిచిపోకండి. ఒక జత కీపింగ్‌ గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరు కదా? సాహా కొన్ని సార్లు గాయపడ్డాడు. అతడికి కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలి. అతడిని పక్కన బెట్టడం వెనుకున్న ఉద్దేశమేంటి" అంటూ కిర్మాణి ప్రశ్నించారు.

సాహా మంచి ప్రదర్శన చేశాడు

సాహా మంచి ప్రదర్శన చేశాడు

1983లో టీమిండియా వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో సయ్యద్ కిర్మాణి వికెట్ కీపర్‌గా ఉన్నారు. "ప్రదర్శన ఆధారంగానే మనం జడ్జి చేయాలి. దేశవాళీ క్రికెట్‌లో సాహా మంచి ప్రదర్శన చేశాడు కాబట్టే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా సాహా దూరంగా ఉన్నప్పుడు, అతడి స్థానంలో కార్తీక్, పంత్ వంటి వారు జట్టులోకి వచ్చారు" అని పేర్కొన్నారు.

ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరం

ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరం

ఇదిలా ఉంటే, ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన సాహా ఇటీవల వెస్టిండిస్‌ పర్యటనకు వెళ్లే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో సాహాకు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. వన్డే, టీ20 సిరీస్‌లో పంత్ విఫలమైన మళ్లీ అతడినే టెస్టులో ఆడించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

Story first published: Tuesday, August 27, 2019, 19:28 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X