న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖలో రోహిత్‌ శర్మ ఒక్క సిక్స్‌ కొడితే.. సచిన్ రికార్డు సమం

India vs West Indies,1st ODI:Rohit Sharma 1 Six Away From Sachin's Sixers Record in ODI's| Oneindia
 India vs West Indies: Rohit Sharma Could Equal Sachin Tendulkars Batting Record In 2nd ODI

విశాఖపట్నం: అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'హిట్‌ మ్యాన్‌'. గువహటి వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ మరో రికార్డును సమం చేసేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. గత మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన రోహిత్‌ శర్మ విశాఖ వేదికగా విండిస్‌తో బుధవారం జరగనుంది.

<strong>విశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివే</strong>విశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివే

రెండో వన్డేలో మరో సిక్సర్‌ కొడితే భారత్‌ తరపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరతాడు. ఇప్పటివరకూ వన్డేల్లో 194 సిక్సర్లు కొట్టిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ సిక్సర్ల రికార్డును చేరేందుకు కేవలం ఒకే ఒక్క సిక్స్ దూరంలో నిలిచాడు.

195 సిక్సర్లతో రెండో స్థానంలో సచిన్

195 సిక్సర్లతో రెండో స్థానంలో సచిన్

ప్రస్తుతం వన్డేల్లో సచిన్‌ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుతం రోహిత్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టన్ సౌరవ్‌ గంగూలీ (190)ను రోహిత్‌ వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.

217 సిక్సర్లతో అగ్రస్థానంలో మహేంద్ర సింగ్ ధోని

217 సిక్సర్లతో అగ్రస్థానంలో మహేంద్ర సింగ్ ధోని

రెండో వన్డేకి బుధవారం భారత్-విండిస్ జట్ల మధ్య విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ వన్డేలో సచిన్‌ టెండూల్కర్ సిక్సర్లు రికార్డును ‘హిట్‌ మ్యాన్‌' అధిగమించే అవకాశం ఉంది. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోని (217) అగ్రస్థానంలో ఉన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు

కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు

విశాఖలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లో కోహ్లీ వరుసగా 118, 117, 99, 65 పరుగులు చేశాడు. అయితే, ఈ వేదికలో జరిగిన ఏకైక టి20లో మాత్రం కోహ్లీ ఆడలేదు. 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులోనూ విరాట్‌ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 167, 81 పరుగులు సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

 ఇప్పటివరకు 7 వన్డేలకు ఆతిథ్యమిచ్చిన విశాఖ

ఇప్పటివరకు 7 వన్డేలకు ఆతిథ్యమిచ్చిన విశాఖ

13 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ధోని చేసిన విధ్వంసం ఇప్పటికీ అభిమానులకు గుర్తే. వ్యక్తిగతంగానే కాకుండా ఫలితాల పరంగా టీమిండియాకు దీనిని కలిసొచ్చిన వేదికగా చెప్పవచ్చు. 2005 ఏప్రిల్‌ 5 నుంచి 2017 డిసెంబర్‌ 17 వరకు ఇక్కడ 7 వన్డేలు జరిగాయి. ఇందులో ఆరింట విజయం సాధించిన టీమిండియా కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లను ఒక్కోసారి ఓడించిన భారత్, శ్రీలంకపై రెండు సార్లు విజయం సాధించింది. ఒకసారి మాత్రం విండీస్‌ చేతిలో ఓటమి పాలైంది.

Story first published: Tuesday, October 23, 2018, 13:55 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X