న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

150కిపైగా స్కోరు 8 సార్లు: రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

India vs West Indies: Rohit Sharma breaches 150 for 8th time in ODIs, extends unparalleled record

హైదరాబాద్: విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 159 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

వన్డేల్లో 150కిపైగా స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ వన్డేల్లో 8 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌(6) రెండో స్థానంలో ఉండగా, సచిన్‌ టెండూల్కర్‌, క్రిస్‌గేల్‌(5సార్లు)లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

విశాఖ వన్డేలో పరుగుల వరద: వెస్టిండిస్ విజయ లక్ష్యం 388విశాఖ వన్డేలో పరుగుల వరద: వెస్టిండిస్ విజయ లక్ష్యం 388

విశాఖ వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా

విశాఖ వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా

విశాఖ వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు ఈ ఏడాది మొత్తంగా వెస్టిండిస్‌పై రోహిత్ శర్మ మూడు సెంచరీలు సాధించాడు. టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు రోహిత్ 227 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఒక ఇంటర్నేషనల్ ఇయర్‌లో 10 సెంచరీలు

ఒక ఇంటర్నేషనల్ ఇయర్‌లో 10 సెంచరీలు

ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ... ఆ తర్వాత హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచేందుకు కేవలం 40 బంతులు తీసుకున్నాడు. దీంతో ఒక ఇంటర్నేషనల్ ఇయర్‌లో 10 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు.

అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో

అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్‌లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(9-1998) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ(7-2000), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(7-2016), రోహిత్ శర్మ(7-2019)లు సంయక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

సచిన్, కోహ్లీ, పాంటింగ్‌ల తర్వాతే రోహితే

సచిన్, కోహ్లీ, పాంటింగ్‌ల తర్వాతే రోహితే

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు సాధించాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.

Story first published: Wednesday, December 18, 2019, 18:20 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X